కొరియన్ మాయలో జెన్- జి తరం.. త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో అంతర్మధనం
How Korean Culture Impacts Gen Z: ప్రస్తుత జెన్-Z తరం యువత కొరియన్ చిత్రాలు, సంగీతం, ఆటలకు విపరీతంగా ఆకర్షితులవడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఇటీవల ఘజియాబాద్‌లో ఓ తండ్రి తన పిల్లల సోషల్ మీడియా అకౌంట్‌లు బ్లాక్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇది పిల్లలు సోషల్ మీడియాకు ఎంతగా అడెక్ట్ అయ్యారో, ఈ వ్యసనం ఎంత ప్రమాదమో తెలియజేస్తుంది.

తల్లి దండ్రులు , కుటుంబ సభ్యులకంటే జెన్ – జి తరం పిల్లలకు కొరియన్ చిత్రాలు , పాటలు , ఆటలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ – z తరం 1997 -2012 మధ్య పుట్టిన పిల్లలు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ , ఆన్లైన్ గేమ్స్ , డిజిటల్ కంటెంట్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారిని డీల్ చేయటం ఇప్పుడు తల్లి దండ్రులకు సవాల్ గా మారుతుంది. ఇటీవల ఘజియాబాద్లో ని భారత్ సిటీ ప్రాంతంలో ఒకే కుటుంబంలో ముగ్గురు అక్క చెల్లెల్లు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చేతన్ కుమార్ ఆర్ధిక ఇబ్బందులతో తన పిల్లలు వాడే ఫోన్లను అమ్మి ఇంటి విద్యుత్ రీచార్జ్ చేసాడు. అంతకు ముందే పిల్లల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసారు. ఈ విషయాన్ని పిల్లలు జీర్ణించు కోలేక కొరియన్ డ్రామాలు , k – pop లు మాప్రాణం అంటూ రాసి చనిపోయారు. ఘటనాస్ధలంలో దొరికిన డైరీలో ఉన్న అంశాలు తల్లిదండ్రులను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
జెన్ – జి తరంపై కొరియన్ ప్రభావం
గజియాబాద్ ఘటన తరువాత ఇపుడు ప్రతి ఒక్కరు పిల్లల్లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ పై చర్చించుకుంటున్నారు. జెన్ – జి తరం వారిని అమితంగా ఆకర్షించే కంటెంట్ ఇందులో ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లల నుంచి ప్రొఫిషనల్ కోర్స్ లు చదివే పిల్లల వరకు అందరూ వీటికి ఆకర్షితులవుతున్నారు. కొరియన్ ఆటలు , డ్రామా , సంగీతం తదితర అంశాల ప్రభావం పిల్లలపై పడుతుంది. కె – పాప్ అంటే కొరియన్ పాప్ సంగీతం గ్రూవ్ లు , బి టి ఎస్ (బియోన్డ్ ది సీన్) ఇది కూడా ఒక కె – పాప్ గ్రూప్, బ్లాక్ పింక్ , ఇది మరో కె – పాప్ గ్రూప్. ఇందులో ఆడపిల్లలు గ్రూప్ గా ఉంటారు. వీళ్లకు పిల్లలు అభిమానులుగా మారి వారి కంటెంట్ , ఫ్యాషన్ , స్టైల్స్ ను అనుసరిస్తున్నారు.
ఇది ఇపుడు పిల్లల వ్యక్తిగత జీవితాలు , కుటుంబ వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జెన్ – జి తరం ఉన్న పిల్లలు ఇళ్లలో ప్రతి తల్లిదండ్రులు ఈ సమస్యను ఎదుర్కొంటూ మానసికంగా క్రుంగిపోతున్నారు. ముఖ్యంగా కొరియన్ డ్రామాల ఆధారంగా రూపొందిన టాస్క్ బేస్డ్ గేమ్స్ కు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. కొరియన్ డ్రామాలు చూస్తున్నపుడు , గేమ్స్ ఆడుతున్నపుడు ఆ ప్రపంచంలో ఉన్న వారు అందులో నుంచి బయటకు రాగానే ఒంటరి వారమనే భవనంలోకి వెళ్లిపోతుంటారని చెబుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ భావన టీనేజర్లలో భావోద్వేగాలను అదుపు చేయలేని స్థాయికి తీసుకువెళ్లి కఠిన నిర్ణయాలకు కారణమవుతున్నాయనేది వైద్యులు చెబుతున్న మాట.
తల్లి దండ్రులు తమ తమ దైనందిన వ్యాపకాల్లో మునిగిపోవటం పిల్లలు త్వరగా వీటి ప్రభవానికి కారణమనే వాదన వినిపిస్తుంది. 16 ఏళ్ళ లోపు పిల్లల పై ఇప్పటికే పలు దేశాలు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు తీసుకువచ్చాయి. మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. అయితే అంతకు ముందే ప్రతి తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సాధ్యమైనంత దగ్గరగా ఉండేందుకు , ఎక్కువ సమయం వారితో గడిపేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. లేదంటే వేగంగా ఒత్తిడికి గురవుతున్న జెన్ – జి తరం నుంచి పలు సమస్యలు అనేక రూపాల్లో బాటపడతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
