AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: సామాన్యులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. ప్రతీఒక్కరికీ రూ.25 వేల సాయం.. ఎవరెవరికి అంటే..?

సైబర్ మోసాల బారిన పడి డబ్బులు పొగోట్టుకునే సమాన్యులకు ఊరట కలిగించేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తంలో సైబర్ నేరాల్లో డబ్బులు పొగోట్టుకున్నవారికి ఆర్బీఐ సాయం అందించనుంది. ప్రస్తుతం జరుగుతున్న ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో ఈ మేరకు ఆర్బీఐ ప్రకటన చేసింది.

RBI: సామాన్యులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. ప్రతీఒక్కరికీ రూ.25 వేల సాయం.. ఎవరెవరికి అంటే..?
Rbi
Venkatrao Lella
|

Updated on: Feb 06, 2026 | 2:03 PM

Share

ఇటీవల బ్యాంక్ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో బ్యాంక్ అకౌంట్లోని సొమ్ము కాజేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకులు అనేక జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ఇక కస్టమర్లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. ఇక ఇందుకోసం సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా తీసుకొస్తున్నాయి బ్యాంకింగ్ సంస్థలు. ఇటీవల సైబర్ ఇన్యూరెన్స్‌లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ఇలాంటి ప్రొటెక్షన్ ప్లాన్, ఇన్యూరెన్స్ వంటికి తీసుకోవడం వల్ల సైబర్ నేరాలు జరిగిన సమయంలో పరిహారం పొందవచ్చు. అయితే సైబర్ నేరాలు ఇటీవల పెరిగిపోతున్న క్రమంలో బాధితులకు అండగా నిలిచేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం కీలక ప్రకటన చేశారు.

రూ.25 వేల పరిహారం

సైబర్ నేరాలు జరిగినప్పుడు బ్యాంకింగ్ కస్టమర్లకు పరిహారం అందేంచేలా ఆర్బీఐ కొత్త నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల బారిన పడ్డ బాధితులకు రూ.25 వేల వరకు పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ ఖాతాదారులు నష్టపోయిన సమయంలో కొంతమేర ఆర్ధిక సాయం అందించేందుకు ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఓ ఫ్రేమ్ వర్క్‌ని ఆర్బీఐ రూపొందించేందుకు సిద్దమవుతోంది. డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులకు భద్రత కల్పించడం, కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటం, తక్షణ ఆర్ధిక సాయం అందించే విధంగా ఆర్బీఐ ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. త్వరలో దీనిపై మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనుంది.

ఏయే సమయాల్లో ఇస్తారంటే..?

బ్యాంక్ నిర్లక్ష్యం లేదా సిస్టమ్ లోపాల వల్ల సైబర్ నేరం జరిగితే కస్టమర్లకు పరిహారం అందేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. కేవలం చిన్న మొత్తాలు మాత్రమే నష్టపోయినప్పుడు సామాన్యులకు ఈ పరిహారం అందిస్తారు. పెద్ద మొత్తంలో కోల్పోయినప్పుడు నష్ట పరిహారం అండదని తెలుస్తోంది. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన పరపతి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి. ఈ సమావేశంలో కలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెపో రేటును 5.25 శాతంగా కొనసాగిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. అలాగే లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులతో బ్యాంకుల కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వీరి వేధింపులకు చెక్ పెట్టేందుకు త్వరలో కొత్త గైడ్ లైన్‌ను విడుదల చేయాలని ఈ సమవేశాల్లో ఆర్బీఐ నిర్ణయించింది. బ్యాంకింగ్ వినియోగదారులకు రక్షణ కల్పించే అనేక నిర్ణయాలను ఈ సమావేశాల్లో ఆర్బీఐ తీసుకుంటోంది. త్వరలో వీటికి సంబంధించిన నిర్ణయాలను అమలు చేయనుంది. దీని వల్ల బ్యాకింగ్ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందనున్నాయి.

Follow Us
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!