AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PT Usha: పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి.. యువతకు పి.టి. ఉష పిలుపు

పెద్ద కలలు కనండి.. ఆ కలల కోసం కష్టపడి పనిచేయండి.. ఎప్పటికీ వెనక్కి తగ్గొద్దు అంటూ భారత క్రీడా దిగ్గజం, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి.టి. ఉష యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికే ఒక కీలక మైలురాయి అని ఆమె అభివర్ణించారు.

PT Usha: పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి.. యువతకు పి.టి. ఉష పిలుపు
Pt Usha On Telangana Sports University
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 11:21 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి ఒక కీలక మైలురాయి అని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష అభివర్ణించారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత అథ్లెట్ల ప్రతిభను పెంపొందించేందుకు ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు.

అథ్లెట్లకు అత్యున్నత శిక్షణ

ప్రధాని మోదీ కలలుగన్న క్రీడా భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయిందని పి.టి. ఉష తెలిపారు. ఒకే వేదికపై కోచ్‌లు, స్పోర్ట్స్ సైన్స్ నిపుణులు, స్పోర్ట్స్ మెడిసిన్, మెడికల్ సపోర్ట్ వ్యవస్థలు అందుబాటులో ఉండటం వల్ల అథ్లెట్లకు అత్యున్నత స్థాయి శిక్షణ లభిస్తుందని, క్రీడాకారుల సమగ్ర అభివృద్ధే ఈ వర్సిటీ ప్రధాన లక్ష్యమని ఆమె వివరించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ రంగాలకు అంకితమైన ఈ యూనివర్సిటీలో పారా స్పోర్ట్స్, స్పోర్ట్స్ రీసెర్చ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడం అభినందనీయమన్నారు.

నిపుణుల తయారీ కేంద్రంగా..

దేశానికి అవసరమైన గొప్ప కోచ్‌లు, ట్రైనర్లు, స్పోర్ట్స్ సైంటిస్టులను తయారు చేసే కేంద్రంగా ఈ యూనివర్సిటీ ఎదగాలని పి.టి. ఉష ఆకాంక్షించారు. కేవలం అథ్లెట్లనే కాకుండా రెఫరీలు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ల తయారీలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని చెప్తూ.. ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ ఫెలోషిప్’ వంటి కార్యక్రమాలు మరింత మంది యువతను క్రీడల వైపు ఆకర్షిస్తాయన్నారు. దేశంలోనే తొలి స్పోర్ట్స్ ఫెలోషిప్ కార్యక్రమానికి అనుసంధానంగా ఈ వర్సిటీ పనిచేయడం విశేషమని కొనియాడారు.

తొలి వీసీ నియామకంపై హర్షం

యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ కిషోర్ నియమితులు కావడం పట్ల పి.టి. ఉష సంతోషం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో విశ్వవిద్యాలయం ఉన్నత లక్ష్యాలను సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారులకు ఆమె ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. యువత పెద్ద కలలు కనాలని, వాటి కోసం కష్టపడి పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ‘నెవర్ గివ్ అప్’ అనే నినాదంతో ముందుకు సాగాలని పి.టి. ఉష పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే..
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే..