AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jana Nayagan: అఫీషియల్.. ఎట్టకేలకు సీఎం విజయ్ ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!

తమిళనాడు ముఖ్యమంత్రి నటించిన 'జన నాయగన్' (తెలుగులో జన నాయకుడు) సినిమా రిలీజ్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికేట్ జారీ చేసింది. తలపతి విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Jana Nayagan: అఫీషియల్.. ఎట్టకేలకు సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
CM Vijay Jana Nayagan Movie
Basha Shek
|

Updated on: Jul 09, 2026 | 10:00 PM

Share

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో దళపతి విజయ్ కోట్లాది మంది అభిమానుల ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. అనేక చట్టపరమైన, సాంకేతిక అడ్డంకులను అధిగమించిన తర్వాత విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ రిలీజ్ కు సెన్సార్ బోర్డు (CBFC) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది . అయితే, ఈ చిత్రానికి వచ్చిన సర్టిఫికేట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జన నాయగన్ చిత్రానికి ‘A’ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇచ్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించిన ప్రకారం, ఈ సినిమా మొత్తం నిడివి 183 నిమిషాలు (3 గంటల 3 నిమిషాలు). ఈ చిత్రం తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని, ఒరిజినల్ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ లభించిందని చెబుతున్నారు. కానీ తమిళ వెర్షన్‌కు ‘A’ సర్టిఫికేట్ రావడం చూస్తే, దర్శకుడు హెచ్. వినోద్ కథ యాక్షన్ సన్నివేశాలలో పెద్ద మార్పులు చేశారని స్పష్టమవుతోంది.

కాగా జన నాయగన్ చిత్రాన్నిమొదట సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న విడుదల చేయాలనుకున్నారు. అందులో బాగంగానే 2025 డిసెంబర్‌లో సెన్సార్‌కు సమర్పించారు. మొదట్లో ఈ చిత్రానికి ‘U/A 16+’ రేటింగ్ లభించవచ్చని చెప్పినప్పటికీ, కమిటీలోని ఒక సభ్యుడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, ఈ చిత్రం రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ఆ తర్వాత, నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో, సెన్సార్ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. దీంతో విజయ్ సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా విడుదల ఆలస్యం కావడం అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ‘తమిళగా వెట్రి కలగం’ పార్టీ ఘన విజయం సాధించడం, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందే పూర్తయిన ఈ చిత్రం, విజయ్ మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో చివరి అంకం.

ఇవి కూడా చదవండి

జన నాయగన్ చిత్రాన్ని ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్ పూర్తయినందున, ఈ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ కు ఇదే మొదటి, చివరి చిత్రం కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నెలకు రూ.103తో 336 రోజుల వ్యాలిడిటీ..అపరిమిత వాయిస్ కాల్స్..డేటా
నెలకు రూ.103తో 336 రోజుల వ్యాలిడిటీ..అపరిమిత వాయిస్ కాల్స్..డేటా
సంప్రదాయ కళతో అదిరిపోయే ఎలక్ట్రిక్ ఆటో యూధా ఈపాడ్
సంప్రదాయ కళతో అదిరిపోయే ఎలక్ట్రిక్ ఆటో యూధా ఈపాడ్
ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టి ఆదుకున్న చిరంజీవి
ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టి ఆదుకున్న చిరంజీవి
ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఛీ కొట్టిన బీసీసీఐ.. ఎవరంటే?
ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఛీ కొట్టిన బీసీసీఐ.. ఎవరంటే?
కాకినాడ AE ఫ్యామిలీ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. సాధిక్‌ఖాన్ అరెస్ట్
కాకినాడ AE ఫ్యామిలీ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. సాధిక్‌ఖాన్ అరెస్ట్
రోహిత్, అభిషేక్ సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా ?
రోహిత్, అభిషేక్ సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా ?
నాయిస్ బడ్స్ VS102 ప్లస్‌తో అన్‌స్టాపబుల్‌.. ఎందుకంటే
నాయిస్ బడ్స్ VS102 ప్లస్‌తో అన్‌స్టాపబుల్‌.. ఎందుకంటే
ఫ్యామిలీ రైడ్స్‌కి మహీంద్రా XEV 9S 6-సీటర్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ
ఫ్యామిలీ రైడ్స్‌కి మహీంద్రా XEV 9S 6-సీటర్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు.. అల్లుడు మృతి
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు.. అల్లుడు మృతి
ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి