AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంప్రదాయ కళతో ఎలక్ట్రిక్ ఆటో చూశారా? భారత్‌లో యూధా ఈపాడ్‌ వివరాలు ఇవే

Youdha EPOD-Bharat Limited Edition Electric Auto.. ఎలక్ట్రిక్ రంగంలో కొత్త ప్రయోగాలు జరుగుతున్న సమయంలో యూధా మరో ఆసక్తికరమైన వెహికల్‌ను మార్కెట్కు పరిచయం చేసింది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ ఆధారంగా ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ ఆటో రిక్షాను ఆవిష్కరించింది. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

సంప్రదాయ కళతో ఎలక్ట్రిక్ ఆటో చూశారా? భారత్‌లో యూధా ఈపాడ్‌ వివరాలు ఇవే
Youdha Epod Bharat Limited Edition Electric Auto
Nikhil
|

Updated on: Aug 22, 2026 | 7:00 AM

Share

సాధారణ ఎలక్ట్రిక్ ఆటోలకు భిన్నంగా భారతీయ సంప్రదాయ కళను ప్రతిబింబించేలా యూధా సరికొత్త వెహికల్‌ను తీసుకువచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రదర్శనలో ఆవిష్కరించిన ఈ మోడల్ అందరినీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన ఫీచర్లు, ప్రత్యేక డిజైన్‌తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఆటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సంప్రదాయ కళా రూపం

ఎలక్ట్రిక్ రంగంలో కొత్త ప్రయోగాలు జరుగుతున్న సమయంలో యూధా మరో ఆసక్తికరమైన వెహికల్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. కంపెనీ తన ఫ్లాగ్‌ షిప్ L5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ ఆధారంగా ‘EPOD-భారత్’ అనే లిమిటెడ్ ఎడిషన్ ఆటో రిక్షాను ఆవిష్కరించింది. ఈ వెహికల్ ప్రత్యేకత కేవలం ఎలక్ట్రిక్ టెక్నాలజీ మాత్రమే కాదు. దీని మీద భారతీయ సంప్రదాయ కళను ప్రతిబింబించేలా చేతితో చిత్రాలు వేయడం విశేషం.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ వ్యాపార మహోత్సవంలో EPOD-భారత్‌ను ప్రదర్శించారు. దేశంలోని సంప్రదాయ హస్తకళలను ఆధునిక ఎలక్ట్రిక్ మొబిలిటీతో కలపాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించినట్లు యూధా తెలిపింది. వెహికల్ బయట భాగాన్ని వార్లీ కళ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. ఇందులో మహిళలు, గ్రామీణ జీవనం, ప్రకృతి, సామూహిక వేడుకలు లాంటి భారతీయ జీవనశైలిని ప్రతిబింబించే చిత్రాలను చూడవచ్చు.

సాధారణంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో డిజైన్ కంటే వినియోగం, మైలేజ్, నిర్వహణ ఖర్చులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే EPOD-భారత్ విషయంలో యూధా మరో అడుగు ముందుకేసింది. సంప్రదాయ భారతీయ కళను ఆధునిక ఎలక్ట్రిక్ వాహనంపైకి తీసుకురావడం ద్వారా దేశ వారసత్వాన్ని, భవిష్యత్తు మొబిలిటీని ఒకే వేదికపై చూపించాలని కంపెనీ భావిస్తోంది. అందుకే ఈ మోడల్ సాధారణ కమర్షియల్ వాహనాల కంటే ప్రత్యేకంగా కనిపిస్తుంది.

వాటర్-వేడింగ్ సామర్థ్యం

EPOD-భారత్‌లో 6 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 50 Nm టార్క్‌ను అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 11.8 kWh LFP బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 227 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. సిటీ ప్రయాణాలకు అనుగుణంగా సిటీ, బూస్ట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. మన దేశంలో అన్ని ప్రాంతాల్లో రోడ్లు ఒకే విధంగా ఉండవు.

వర్షాలు, నీరు నిలిచే ప్రాంతాలు, గుంతలు వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని EPODను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనానికి 300 మిల్లీమీటర్ల వాటర్-వేడింగ్ సామర్థ్యం ఉంది. దీంతో వర్షాకాలంలో నీరు నిలిచిన రోడ్లపై కూడా వాహనాన్ని చక్కటగా నడిపే అవకాశం ఉంటుంది. యూధా EPOD ప్రారంభ ధర రూ.3.20 లక్షలు అని ప్రకటించింది.

ఈ వాహనాన్ని ముఖ్యంగా స్వయం ఉపాధి పొందుతున్న డ్రైవర్లు, మొబిలిటీ రంగంలో పనిచేసే చిన్న వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం, రోజువారీ ప్రయాణాలకు అనుకూలమైన రేంజ్ ఉండటం ఈ విభాగంలో కీలకంగా మారవచ్చు. EPODను ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో ఉన్న యూధా తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు.

Follow Us
నెలకు రూ.103తో 336 రోజుల వ్యాలిడిటీ..అపరిమిత వాయిస్ కాల్స్..డేటా
నెలకు రూ.103తో 336 రోజుల వ్యాలిడిటీ..అపరిమిత వాయిస్ కాల్స్..డేటా
సంప్రదాయ కళతో అదిరిపోయే ఎలక్ట్రిక్ ఆటో యూధా ఈపాడ్
సంప్రదాయ కళతో అదిరిపోయే ఎలక్ట్రిక్ ఆటో యూధా ఈపాడ్
ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టి ఆదుకున్న చిరంజీవి
ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టి ఆదుకున్న చిరంజీవి
ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఛీ కొట్టిన బీసీసీఐ.. ఎవరంటే?
ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఛీ కొట్టిన బీసీసీఐ.. ఎవరంటే?
కాకినాడ AE ఫ్యామిలీ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. సాధిక్‌ఖాన్ అరెస్ట్
కాకినాడ AE ఫ్యామిలీ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. సాధిక్‌ఖాన్ అరెస్ట్
రోహిత్, అభిషేక్ సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా ?
రోహిత్, అభిషేక్ సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా ?
నాయిస్ బడ్స్ VS102 ప్లస్‌తో అన్‌స్టాపబుల్‌.. ఎందుకంటే
నాయిస్ బడ్స్ VS102 ప్లస్‌తో అన్‌స్టాపబుల్‌.. ఎందుకంటే
ఫ్యామిలీ రైడ్స్‌కి మహీంద్రా XEV 9S 6-సీటర్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ
ఫ్యామిలీ రైడ్స్‌కి మహీంద్రా XEV 9S 6-సీటర్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు.. అల్లుడు మృతి
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు.. అల్లుడు మృతి
ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి