AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: సీఎం స్పెషల్.. మనవడి కోసం పూరీలు వేసిన రేవంత్ రెడ్డి.. వీడియో చూశారా..?

నిత్యం రాజకీయాలు, అధికారిక సమావేశాలతో బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ప్రత్యేక క్షణాలతో వార్తల్లో నిలిచారు. తన మనవడు రేయాన్ష్ కోసం స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు చేసి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మనవడితో సరదాగా మాట్లాడుకుంటూ పూరీలు వేస్తూ గడిపిన ఈ క్షణాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పంచుకోవడంతో నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.

Revanth Reddy: సీఎం స్పెషల్.. మనవడి కోసం పూరీలు వేసిన రేవంత్ రెడ్డి.. వీడియో చూశారా..?
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2026 | 5:50 PM

Share

సీఎం రేవంత్ రెడ్డి.. ఎప్పుడూ ఫైరే.. తుటాల్లాంటి మాటలు.. ఛలోక్తులు.. విమర్శలు.. ఇవన్నీ చూస్తునే ఉంటాం.. నిత్యం అధికారులతో మీటింగ్.. పలు అంశాలపై సమీక్షలు.. పార్టీ కేడర్ తో రాజకీయ సమావేశాలు.. తీరకలేని విధంగా అపాయిట్‌మెంట్స్.. ఇలా హాట్ హాట్ అప్‌డేట్స్‌‌తో నిత్యం సీఎం రేవంత్ రెడ్డి వార్తల్లో ఉంటారు.. అలాంటి సీఎం రేవంత్ రెడ్డి.. సడెన్ గా గంటె పట్టారు.. వంటగదిలో ప్రత్యక్షమై పూరీలు వండారు.. సీఎం ఏంటీ.. పూరీలు వండటం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. మీరు చదివింది నిజమే.. సీఎం రేవంత్‌ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా వంటగదిలోకి వెళ్లి, పూరీలు చేసి పెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది..

మనవడి కోసం గంటె పట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. స్వయంగా పూరీలు చేసి, నూనెలో వేయించారు.. మనవడు పక్కన ఉండగా.. ఆయన సరదాగా మాట్లాడుతూ.. దగ్గరుండి మరీ పూరీలు వండిపెట్టారు. అయితే.. మనవడితో చిట్‌చాట్‌ కూడా చాలా సరదాగా సాగింది. ఈ పూరీలు చాలా అని సీఎం రేవంత్ రెడ్డి.. మనవడు రేయాన్ష్ ని అడిగితే అమ్మమ్మకో అంటూ మనవడు అడగడం భలే ఫన్నీగా ఉంది.

వీడియో చూడండి..

తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా అని మనవడు అడిగితే తప్పుతుందా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!