AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi: 3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. ప్రపంచకప్ ఫైనల్లో తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..

England U19 vs India U19, Final, ICC Under 19 World Cup 2026: భారత జట్టు రికార్డు స్థాయిలో 10వ సారి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు1998లో ఏకైక టైటిల్‌ను గెలుచుకున్న ఇంగ్లాండ్ 3వసారి ఫైనల్‌కు చేరుకుంది. గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అంటే, 2022 ఫైనల్‌లో ఇంగ్లండ్ జట్టును ఓడించి ఐదవసారి ట్రోఫీని గెలుచుకుంది భారత్.

Vaibhav Suryavanshi: 3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. ప్రపంచకప్ ఫైనల్లో తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Feb 06, 2026 | 2:11 PM

Share

Vaibhav Sooryavanshi: ఐదుసార్లు ఛాంపియన్స్ గా నిలిచిన భారత్.. 1998 విజేత ఇంగ్లాండ్ మధ్య ఈరోజు అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత జట్టుకు తొలి ఎదురు దెబ్బ తగిలినా.. వైభవ్ సూర్యవంశీ, ఆయూష్ మాత్రేలు భారత జట్టును ఆదుకున్నారు. వార్త రాసే సమాయానికి భారత జట్టు 13.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. చేసింది. వైభవ్ సూర్యవంశీ (55), ఆయుష్ మాత్రే (34)  కీలక భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు. తొమ్మిది పరుగుల వద్ద ఆరోన్ అవుట్ అయ్యాడు.

వైభవ్ హాఫ్ సెంచరీ..

ఆది నుంచి దూకుడుగా కనిపించిన వైభవ్ సూర్యవంశీ.. బౌండరీలతో డీల్ చేస్తున్నాడు. తొలుత ఆడితూచి ఆడిన వైభవ్ కేవలం 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే, అభిమానులు మాత్రం సెంచరీతో చెలరేగాలని కోరుకుంటున్నారు.

11వ ఓవర్లో భారత జట్టు 10 పరుగులు చేసింది. ఆ ఓవర్ లోని నాల్గవ బంతికి వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికే సింగిల్ కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచ కప్ లో వైభవ్ కు ఇది నాల్గవ అర్ధ సెంచరీ. కేవలం 32 బంతుల్లోనే దీనిని పూర్తి చేశాడు.

ఇరు జట్లు:

ఇంగ్లాండ్ U19 (ప్లేయింగ్ XI): బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్, థామస్ రెవ్ (కెప్టెన్, కీపర్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్.

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(కీపర్), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

ఆర్బీఐ శుభవార్త.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్
ఆర్బీఐ శుభవార్త.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్
ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
కొరియన్ మాయలో జెన్- జి తరం.. త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో
కొరియన్ మాయలో జెన్- జి తరం.. త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో
సైబర్ నేరాల్లో డబ్బులు పోయాయా..? రూ.25 వేల ఆర్దిక సాయం
సైబర్ నేరాల్లో డబ్బులు పోయాయా..? రూ.25 వేల ఆర్దిక సాయం
3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
వామ్మో.. రైల్లో ప్రయాణిస్తున్న పాములు.. శాస్త్రవేత్తల పరిశోధనలో..
వామ్మో.. రైల్లో ప్రయాణిస్తున్న పాములు.. శాస్త్రవేత్తల పరిశోధనలో..
ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..!
ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..!
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?