AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ ఉల్లిపాయ తింటే డాక్టర్ల అవసరం ఉండదా.. శరీరంలో ఏం జరుగుతుందంటే..?

Onions Benefits: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఊరికే పుట్టలేదు.. మనం రోజూ వాడే ఉల్లిపాయ కేవలం కూరలకు రుచిని ఇవ్వడమే కాదు అది ఒక పవర్‌ఫుల్ మెడిసిన్ అని మీకు తెలుసా? కొలెస్ట్రాల్ తగ్గించడం నుంచి జుట్టు పెరగడం వరకు.. ఉల్లిపాయ చేసే మ్యాజిక్ అంతా ఇంత కాదు. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వాటి జోలికి వెళ్లకూడదు.

రోజూ ఉల్లిపాయ తింటే డాక్టర్ల అవసరం ఉండదా.. శరీరంలో ఏం జరుగుతుందంటే..?
Health Benefits Of Onions
Krishna S
|

Updated on: Feb 06, 2026 | 1:28 PM

Share

భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూరలు, సూప్‌లు, స్టూలు.. ఇలా ఏ పదార్థమైనా ఉల్లిపాయ పడితేనే ఆ రుచే వేరు. చికెన్, మటన్, బిర్యానీ తినేటప్పుడు ప్లేట్‌లో ఉల్లిపాయ ఉండాల్సిందే.. అయితే ఉల్లిపాయ కేవలం రుచిని పెంచడమే కాదు అంతకు మించిన అద్భుత ఔషధ గుణాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయుష్ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ స్మితా శ్రీవాస్తవ ప్రకారం.. ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పచ్చి ఉల్లిపాయ లేదా ఉడికించిన ఉల్లిపాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.

గుండె పదిలం.. కొలెస్ట్రాల్‌కు చెక్

గుండె ఆరోగ్యానికి ఉల్లిపాయ ఒక వరం లాంటిది. ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులకు వరం

మధుమేహంతో బాధపడేవారు ఉల్లిపాయను తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

ఉల్లిపాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శరీరం నుండి విషపూరిత పదార్థాలనుబయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

అందమైన చర్మం.. ఒత్తైన జుట్టు

ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా ఉల్లిపాయ మేలు చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. అలాగే ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొత్త జుట్టు పెరగడానికి సహకరిస్తుంది.

ఎవరు తినకూడదు?

ప్రయోజనాలు ఉన్నప్పటికీ, తీవ్రమైన కడుపు సమస్యలు ఉన్నవారు లేదా ఉల్లిపాయ అలర్జీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. ఉల్లిపాయలను సరైన మోతాదులో తీసుకున్నప్పుడే శరీరానికి పూర్తిస్థాయిలో శక్తి, ఆరోగ్యం లభిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా?
మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా?
దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ
దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ
చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష
చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష
యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!
యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..