AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lean Liver Disease: ఫ్యాటీ లివర్ కాదు.. ఇది కూడా సమస్యే.. లైట్ తీసుకున్నారో ఇక మీ బాడీ షెడ్డుకే!

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యల భారీన పడుతున్నారు. వాటిలో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఇది ఒకప్పుడు కేవలం అధిక బరువు ఉన్నవారిలో, అధిక బొడ్డు కొవ్వు ఉన్నవారిలో మాత్రమే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు ఫిట్‌గా, సన్నగా ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని లీన్ లివర్ డిసీజ్ అంటారు.

Lean Liver Disease: ఫ్యాటీ లివర్ కాదు.. ఇది కూడా సమస్యే.. లైట్ తీసుకున్నారో ఇక మీ బాడీ షెడ్డుకే!
Lean Liver Disease
Anand T
|

Updated on: Feb 06, 2026 | 3:14 PM

Share

చాలా మంది లావ్‌గా ఉన్న వారికి మాత్రమే ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయనుకుంటారు. కానీ మీకు తెలియని అసలు విషయం ఏమిటంటే మీరు సన్నగా ఉండి, సాధారణ బరువు ఉన్న కూడా మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటుంది. దీనినే వైద్య పరిభాషలో లీన్ లివర్ డిసీజ్ అంటారు. ప్రస్తుతం చాలా మందిలో ఈ వ్యాధి పెరిగిపోతుంది. అయితే బెల్లీ ఫ్యాట్ లేదా ఆల్కహాల్ అలావాటు లేని వారికి కూడా ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఈ వ్యాధి పెరగడానికి కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

లీన్ లివర్ డిసీజ్ అంటే ఏమిటి?

లీన్ లివర్ డిసీజ్ (LD) అనేది ఫ్యాటీ లివర్ వ్యాధిని సూచిస్తుంది. ఇది గ్రేడ్ 1 లేదా 2 ఫ్యాటీ లివర్ ద్వారా వర్గీకరించబడిన పరిస్థితి, సాధారణ BMI ఉన్నవారు మద్యం తాగకపోయినా, లేదా కొద్దిగ మద్యం తాగిన వారిలో ఈ లీన్ లివర్ వ్యాధి సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సన్నగా ఉన్నవారికి ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?

ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి ప్రకారం.. కొందరు బయటకు చూడ్డానికి సన్నగా కనిపించినా, వారి శరీరంలో కాలేయంపై అంతర్గం కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఇది జీవక్రియను దెబ్బతీస్తుంది.ఈ పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా సన్నగా ఉన్నవారిలో కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

సన్నగా ఉండేవారిలో ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలు?

  • కడుపు లోపల కొవ్వు పెరిగిపోవడం
  • షుగర్ ఎక్కువగా తీసుకోవడం
  • వ్యాయం, వాకింగ్, రన్నింగ్ వంటి శారీరక శ్రమ లేకపోవడం
  • కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాలు కూడా కావచ్చు
  • మీ BMI సాధారణంగా ఉన్నప్పటికీ, స్వల్ప బరువు పెరుగుదల కనిపించడం

సన్నగా ఉండేవారిలో కొవ్వు కాలేయం తక్కువ ప్రమాదకరమా?

డాక్టర్ సుభాష్ ప్రకారం.. ఫ్యాటీ లివర్ అందరికీ హానికరం, ఇది లావు లేదా సన్నగా ఉన్నారనే తేడా లేకండా అందరిలో లివర్‌ను దెబ్బతీస్తుంది. కానీ చాలా మంది ఈ విషయాన్ని విస్మరించి తామకు ఫ్యాటీ లివర్ లేదని చికిత్స తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ ఒక వ్యక్తిని లివర్ సిర్రోసిస్‌కు గురి చేస్తుంది. అందువల్ల, ప్రతి ఒక్కరూ కొన్ని లక్షణాలపై శ్రద్ధ వహించడం ముఖ్యం.

కొవ్వు కాలేయం సాధారణ లక్షణాలు

నిరంతర కడుపు నొప్పి, అలసట, బలహీనత, అజీర్ణం, వాంతులు లేదా వికారం

కొవ్వు కాలెయాన్ని ఎలా నివారించాలి?

  • రోజూ వ్యాయామం చేయండి
  • స్వీట్లు తక్కువగా తీసుకోండి.
  • మీకు కడుపు నొప్పి లేదా అజీర్ణం ఉంటే, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి.
  • మీ ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us