పచ్చి బఠానీ తినడం వలన కలిగే అద్భుతమైన లాభాలు ఇవే!

Samatha

4 June 2026

పచ్చి బఠానీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చాలా వరకు వీటిని కొంత మంది నార్మల్‌గా తింటే మరికొంత మంది వంటల్లో ఉపయోగిస్తారు.

పచ్చి బఠానీ

అయితే వీటిని  ఎలా తిన్నా సరే ఇవి శరీరానికి చాల మేలు చేస్తాయంట. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

శరీరానికి మేలు

అందువలన వారంలో ఒకసారి లేదా ప్రతి రోజూ గుప్పెడు పచ్చి బఠానీలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు.

ఆరోగ్య ప్రయోజనాలు

ముఖ్యంగా పచ్చి బఠానీల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.

ప్రోటీన్ పుష్కలం

అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన, ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది.

గుండె ఆరోగ్యం

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన బఠానీ తినడం వలన ఇవి జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

జర్ణక్రియ వేగవంతం

బరువు తగ్గాలి అనుకునే వారికి ఇవి చాలా బెస్ట్. ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇవి కడుపు నిండిన ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బరువు నియంత్రణ

విటమిన్ C, విటమిన్ A, జింక్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా చర్మ నిగారింపుకు కూడా ఇవి దోహద పడతాయి.

చర్మ నిగారింపు