వేసవిలో వ్యాయామం చేసే వారికి అలర్ట్.. ఈ తప్పు చేస్తే ముప్పే!

Samatha

4 June 2026

తీసుకుంటున్న ఆహారం కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం ఎక్కువైపోయింది.

జీవనశైలి

 చాలా మంది తమ ఆరోగ్యం ఫిట్‌గా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవడానికి రోజూ వారి పనులలో వ్యాయామం కూడా ఒకటైపోయింది.

శరీరం ఫిట్‌

అందుకే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తున్నారు. అయితే వ్యాయామం చేయడం మంచిదే అయినప్పటికీ సమ్మర్‌లో చేసే ముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట.

వేసవి జాగ్రత్తలు

వేసవిలో వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని పట్టించుకోకుండా వ్యాయామం చేయడం వలన అది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందంట.

వ్యాయామంతో సమస్యలు

వేసవిలో వీలైనంత వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉండే సమయం ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే చేయాలంట.

సాయంత్రం, ఉదయం

మరీ ముఖ్యంగా ఎక్కువ నీడ ఉండే పార్కుల్లో చేయడం మేలు. అదే విధంగా సమ్మర్‌లో వ్యాయామం చేసే సమయంలో లేత రంగులు, వదులుగా ఉండేవి ధరించడం, టోపీ ధరించడం మంచిది.

నీడ ఉండే పార్కులు

కొంత మంది గంటల తరబడి వ్యాయామం చేస్తుంటారు. కానీ ఈ సమయంలో అంతగా కాకుండా కేవలం 45 నిమిషాలు వ్యాయామం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు.

45 నిమిషాలు

మరీ ముఖ్యంగా మీకు నీరసం, వికారం, కళ్లు తిరగడం, విపరీతమైన చెమటలు పట్టడం వంటి సమస్యలు ఎదురు అవుతే వేసవిలో వ్యాయామం ఆపేయడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.

ఈ సమయంలో జాగ్రత్త అవసరం