హనుమకొండలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది. తొలిరోజు 828 హుండీలలో 125 హుండీలను లెక్కించగా, రూ. 2 కోట్ల 49 లక్షల 65 వేల ఆదాయం సమకూరింది. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించి బ్యాంకులో జమ చేస్తున్నారు. తడిసిన నోట్లను ఆరబెట్టి మరీ కౌంటింగ్ చేస్తున్నారు. వందలాది మంది సిబ్బంది, వాలంటీర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు.