AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh: రింకు సింగ్‌కు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే..?

భారత జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ యూఎస్ఏతో జరగనుంది. ఇప్పటికే పూర్తి సన్నద్ధమైన భారత జట్టు ఆటగాడు రింకు సింగ్‌ టీ20 ప్రపంచ కప్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సమయంలో రింకు సింగ్ కు ఓ షాక్ న్యూస్ తగిలింది.

Rinku Singh: రింకు సింగ్‌కు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే..?
Rinku Singh
Venkata Chari
|

Updated on: Feb 06, 2026 | 1:43 PM

Share

Rinku Singh Facebook Hack: భారత జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ యూఎస్ఏతో జరగనుంది. ఇప్పటికే పూర్తి సన్నద్ధమైన భారత జట్టు ఆటగాడు రింకు సింగ్‌ టీ20 ప్రపంచ కప్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సమయంలో రింకు సింగ్ కు ఓ షాక్ న్యూస్ తగిలింది. సిక్సర్ సింగ్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయిందంట. ఈమేరకు రింకు సింగ్ సోదరుడు సోనమ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అలీఘఢ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాడు. రింకు సింగ్ ఫేస్‌బుక్‌ హ్యాక్ చేసిన కేటుగాళ్లు, మోనిటైజేషన్‌ తో వచ్చే ఆదాయాన్ని తమ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారి రింకు సోదరుడు తెలిపారు.

ఫిర్యాదు ప్రకారం, రింకు సింగ్ టీ20 ప్రపంచ కప్ కోసం సన్నాహాలతో బిజీగా ఉన్నాడు. దీని కారణంగా అతను తన సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేయలేకపోయాడు. ఫిబ్రవరి 4న రింకు తన ఫేస్‌బుక్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు పాస్‌వర్డ్ పనిచేయడం లేదని తెలిసింది. దీంతో ఫేస్ బుక్ హ్యాక్ అయినట్లు వెలుగులోకి వచ్చింది.

ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం..

సైబర్ మోసం కేసుతో పాటు, రింకు సింగ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 8న లక్నోలో జరిగిన గ్రాండ్ రింగ్ వేడుకలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, జయా బచ్చన్ సహా పలువురు ఉన్నత స్థాయి నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఆర్థిక సమస్యల నుంచి జాతీయ స్టార్ డమ్..

రింకు సింగ్ ఎంతో కష్టపడి పనిచేశాడు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అతని తండ్రి గ్యాస్ సిలిండర్ డెలివరీమాన్‌గా పనిచేశాడు. కుటుంబాన్ని పోషించడానికి రింకుతోపాటు అతని సోదరులు కూడా సిలిండర్లను డెలివరీ చేయడంలో సహాయం చేశారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రింకు అరువు తెచ్చుకున్న క్రికెట్ కిట్ తో ఆడటం కొనసాగించాడు. ఐపీఎల్ (IPL) 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున కొట్టి ఐదు సిక్సర్ల తర్వాత అతని జీవితం మారిపోయింది. అది అతనికి ఇంటి పేరుగా మారింది.