5. శ్రీ వారాహి ప్రత్యంగిరా దేవాలయం..
హైదరాబాద్లోని కొత్తపేట, ఆర్కే పురం ప్రాంతంలో ఉన్న శ్రీ వారాహి ప్రత్యంగిరా దేవాలయం శక్తి ఆరాధకులకు ప్రత్యేకమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీ వారాహి అమ్మవారు, ప్రత్యంగిరాదేవి, శ్రీ శరభేశ్వర స్వామివారిని ప్రధానంగా ఆరాధిస్తారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, జ్వాలాముఖి, రాజశ్యామల, శ్రీలలితా త్రిపురసుందరి వంటి దేవతలకు కూడా ఉపాలయాలు ఉన్నాయి. వారాహి అమ్మవారిని దుర్గాదేవి శక్తి స్వరూపాల్లో ఒకటిగా భావిస్తారు. ప్రత్యంగిరాదేవిని ఉగ్రశక్తికి, రక్షణకు ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయంలో సంప్రదాయ వైదిక పద్ధతుల్లో హోమాలు నిర్వహిస్తారని ఆలయ వివరాలు తెలియజేస్తున్నాయి. పంచమి, పౌర్ణమి, అమావాస్య వంటి సందర్భాల్లో ప్రత్యేక వారాహి, ప్రత్యంగిరా హోమాలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే భక్తులు ఈ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. అయితే ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొనాలనుకునేవారు ముందుగానే ఆలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవడం మంచిది.
ఆలయ వివరాలు:
ప్రాంతం: ప్లాట్ నంబర్ 92, రోడ్ నంబర్ 7, ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ, ఆర్కే పురం, కొత్తపేట, హైదరాబాద్.
దర్శన వేళలు: సోమవారం, బుధవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు. మంగళవారం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు.
ప్రత్యేకత: వారాహి, ప్రత్యంగిరాదేవి ఆరాధన, వైదిక హోమాలు.