AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. ఎంత పెద్ద పామో.. గెస్ట్‌హౌస్‌ దగ్గర చివరకు ఏం జరిగిందంటే.. వీడియో

తిరుమలలోని వకుళమాత గెస్ట్‌హౌస్‌ సమీపంలో సుమారు 9 అడుగుల పొడవున్న జర్రిపోతు కనిపించడంతో భక్తులు, టీటీడీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ అటవీ విభాగం కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్‌ నాయుడు పామును సురక్షితంగా పట్టుకుని బ్యాగ్‌లో బంధించారు. అనంతరం శేషాచలం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇటీవల తిరుమల పరిసరాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

బాబోయ్.. ఎంత పెద్ద పామో.. గెస్ట్‌హౌస్‌ దగ్గర చివరకు ఏం జరిగిందంటే.. వీడియో
Tirumala Snake
Raju M P R
| Edited By: |

Updated on: Oct 14, 2026 | 9:50 AM

Share

తిరుమల కొండపై పాముల సంచారం కలవరపెడుతోంది. తిరుమలలో తరచూ భక్తుల కంటపడుతున్న పాములు బుసలు కొడుతుండటంతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం టీటీడీ సిబ్బందికి లేదా భక్తులకు పాములు కనిపిస్తూనే ఉన్నాయి. విష సర్పాలు అలజడి చేస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుండగా.. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఒకవైపు మలయప్ప స్వామి శేష వాహనంపై ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిస్తుంటే మరోవైపు పాములు భక్తులు కంటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. 9 అడుగుల జర్రిపోతూ వకుళ మాత గెస్ట్ హౌస్ వద్ద స్థానికుల కంటబడింది. పాము సంచారంతో వకుళ మాత గెస్ట్ హౌస్ సిబ్బంది అప్రమత్తమయింది. 9 అడుగుల జర్రిపోతును గుర్తించి టిటిడి సిబ్బందికి సమాచారం ఇచ్చారు..

ఈ మేరకు టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పాములు పట్టే కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు 9 అడుగుల జర్రిపోతును పట్టుకునే ప్రయత్నం చేశారు. చాకచక్యంగా సేఫ్‌గా జెర్రిపోతును చేతితో పట్టుకుని బ్యాగ్ లో బంధించారు. అనంతరం భాస్కర్ నాయుడు పామును శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. దీంతో భక్తులు, టిటిడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

అయితే.. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పాముల సంఖ్య ఈ మధ్యకాలం లో ఎక్కువైందని.. ఏక్కడైనా కనిపిస్తే వెంటనే సమచారం అందించాలని భాస్కర్ నాయుడు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. రియాద్‌పై హౌతీల క్షిపణి దాడులు..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. రియాద్‌పై హౌతీల క్షిపణి దాడులు..
గెస్ట్ హౌస్‌ దగ్గర ఎంత పెద్ద పామో.. చివరకు ఏం జరిగిందంటే..
గెస్ట్ హౌస్‌ దగ్గర ఎంత పెద్ద పామో.. చివరకు ఏం జరిగిందంటే..
లీగల్ యాక్షన్‌కు దిగిన టీమిండియా మాజీ ఓపెనర్
లీగల్ యాక్షన్‌కు దిగిన టీమిండియా మాజీ ఓపెనర్
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా