AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ ఆహారంలో విషం కలుపుతూ స్పై కెమెరాకు చిక్కిన ఇంజినీర్‌!

అమెరికాలో ఓ మహిళకు దాదాపు 18 నెలల పాటు తాగునీటిలో విష పదార్థాన్ని కలిపి ఇచ్చిన ఇంజినీర్‌ కేసు కలకలం రేపుతోంది. అనారోగ్యంతో పలుమార్లు ఆసుపత్రులకు వెళ్లిన ఆమెకు అసలు కారణం తెలియలేదు. చివరకు తన కార్యాలయంలో రహస్యంగా కెమెరా ఏర్పాటు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆమె వాటర్‌ బాటిల్‌తో ఓ సహోద్యోగి వ్యవహరిస్తున్న తీరు కెమెరాలో రికార్డయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డేవిడ్‌ జు ప్రొబేషన్‌ గడువు పూర్తి చేసుకున్నాడు. తనపై నమోదైన నేర నిర్ధారణను తొలగించాలని తాజాగా కోర్టును ఆశ్రయించాడు.

మహిళ ఆహారంలో విషం కలుపుతూ స్పై కెమెరాకు చిక్కిన ఇంజినీర్‌!
Us Woman Health Goes Bad After Ex Colleague Poisons Her Over 18 Months
Sharada V
|

Updated on: Oct 14, 2026 | 11:19 AM

Share

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రసాయన ఇంజనీర్ డేవిడ్‌ జు.. బర్కిలీ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థలో మెటలర్జిస్ట్‌గా పనిచేసేవాడు. అదే సంస్థలో పనిచేసే రోంగ్‌ యువాన్‌ అనే మహిళకు 2017 నుంచి 2019 మధ్య కాలంలో ఆహారం, తాగునీటిలో కాడ్మియం అనే విషపూరిత భారీ లోహాన్ని కలిపి ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. విషపూరిత లోహం క్యాడ్మియం శరీరంలో కీలక అవయవాలను దెబ్బతీసి ప్రాణాలు తీస్తుంది. ఆ సమయంలో రోంగ్‌ యువాన్‌ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పలుమార్లు ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది. తనకు ఏదైనా ప్రాణాంతక వ్యాధి వచ్చిందేమోనని ఆమె భయపడింది.

స్పై కెమెరాతో బయటపడిన అసలు విషయం

కార్యాలయంలో తన డెస్క్‌ వద్ద రహస్యంగా కెమెరాను ఏర్పాటు చేసింది రోంగ్‌ యువాన్‌. కెమెరాలో డేవిడ్‌ జు ఆమె వాటర్‌ బాటిల్‌లో కాడ్మియం కలుపుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. తనకు విషం ఇస్తున్న వీడియోను చూసిన షాకైనట్లు యువాన్‌ తెలిపింది. ఎన్నోసార్లు మృత్యువుకు దగ్గరగా వెళ్లినట్లు అనిపించిందని వాపోయింది. 2018 నవంబర్‌ 27న రోంగ్‌ యువాన్‌ ఆరోగ్యం క్షీణించి సెలవు కావాలని కోరుతూ మెయిల్ చేసింది. స్పందించిన జు.. ఆరోగ్యం మెరుగుపడే వరకు ఇంటి నుంచే పని చేయాలని ఆమె అనారోగ్యానికి కార్యాలయంలోని బూజు కారణమై ఉండొచ్చని మెయిల్‌ కి రిప్లై ఇచ్చాడట.

2019లో అరెస్ట్‌.. హత్యాయత్నం అభియోగాలు తొలగింపు

ఈ కేసులో డేవిడ్‌ జును 2019 మార్చిలో పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం, విషప్రయోగానికి సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి. యువాన్‌ తల్లిదండ్రులు కూడా కలుషితమైన నీటిని తెలియకుండా తాగి అనారోగ్యం పాలయ్యారు. తనకు జరిగిన నష్టానికి, ఆరోగ్య సమస్యలకు రోంగ్ యువాన్ దాదాపు 5 లక్షల డాలర్లు పరిహారంగా కోరింది. అయితే, కోర్టు ఆ మొత్తాన్ని తగ్గించి డేవిడ్ జు 7,058 డాలర్లు మాత్రమే పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

అనేక మలుపులు తిరిగిన ఈ కేసు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. డేవిడ్‌ జు 2026 మార్చిలో తన రెండేళ్ల ప్రొబేషన్‌ గడువును పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు కాలిఫోర్నియా చట్టం నిబంధనల ప్రకారం తనపై నమోదైన ఫెలనీ నేర నిర్ధారణను తొలగించాలని కోర్టును కోరుతున్నాడు. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం, ప్రొబేషన్‌ పూర్తి చేసిన నిందితులు తమ నేర నిర్ధారణను రద్దు చేయించుకునేందుకు అర్హత పొందుతారు.

Follow Us