అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్ కన్నుమూత

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న కొద్దిరోజులకే కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్ (73) తుదిశ్వాస విడిచారు.

అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్ కన్నుమూత
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 05, 2020 | 7:50 PM

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న కొద్దిరోజులకే కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్ (73) తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డ రషీద్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం రషీద్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షల నిర్వహించగా, కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అయన్ను చికిత్స కోసం ఓ ఢిల్లీ ఆస్పత్రిలో చేర్పించామనీ ఆయన బంధువు, మాజీ ఎమ్మెల్యే ఇమ్రాన్ మసూద్ వెల్లడించారు. చికిత్స అనంతరం కోలుకుని ఆయన సహారన్పూర్ తిరిగి చేరుకున్నారు. అయితే మళ్లీ కరోనా తాలూకు సమస్యలు తిరగబెట్టడంతో రూర్కీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించామనీ.. చికిత్స పొందుతూనే సోమవారం ఉదయం రషీద్ మృతి చెందినట్టు ఇమ్రాన్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లోని సహారన్పూర్ నుంచి రషీద్ ఐదు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన.. అప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రషీద్ మసూద్ మృతి పట్ల పలువురు రాజకీయనేతలు సంతాపం వ్యక్తం చేశారు.