Parota: పరోటా, ఫ్రైడ్ రైస్ తిని టెకీ మృతి.. ఇంతకీ ఏం జరిగిందంటే..
పరోటా, ఫ్రైడ్ రైస్ తిన్న వ్యక్తి హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. పాండిచ్చేరిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పరోటా, ఫ్రైడ్ రైస్ తిన్న వ్యక్తి హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. పాండిచ్చేరిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి అరియపాళయంకు చెందిన సెల్వరాసు కానన్ సత్యమూర్తి (33) అనే వ్యక్తి చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 14న సాయంత్రం షాపింగ్ కోసం తన భార్య సుకాంతితో కలిసి పుదుచ్చేరి వెళ్లాడు. షాపింగ్ అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో సుల్తాన్‌పేటలోని ఓ హోటల్‌లో ఫ్రైడ్ రైస్, పరాటా తిన్నాడు. అనంతరం రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వచ్చి నిద్రపోయాడు. తెల్లవారుజామున నిద్రలేచిన భార్య పక్కనే ఉన్న భర్త అచేతనంగా పడి ఉండటాన్ని చూసి భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు సత్యమూర్తిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సత్యమూర్తి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
పుదుచ్చేరి పక్కనే ఉన్న సుల్తాన్‌పేటలోని సదరు హోటల్ మాంసాహార వంటకాలకు చాలా ఫేమస్. పరాటా, బిర్యానీ, తాళికారి, బోటి కూర వంటి మాంసాహార వంటకాలకు అక్కడ ఫేమస్. కస్టమర్లతో ఆ హోటల్ ఎప్పుడూ కిటకిట లాడుతూ ఉంటుంది. పరిశుభ్రత ప్రమాణాలు పాటించరనే ఆరోపణలు హోటల్ యాజమన్యంపై తరచూ వస్తుంటాయి. పుదుచ్చేరి ఆహార నియంత్రణ శాఖ అధికారులు సుల్తాన్‌పేటలోని సదరు హోటల్‌లో తనిఖీలు చేపట్టారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.