బెంగాల్ లో రోడ్ షోలు, బైక్ ర్యాలీల నిషేధం, ఎన్నికల కమిషన్ ఆదేశం, తక్షణమే అమలు
పశ్చిమ బెంగాల్ లో రోడ్ షోలను, బైక్ ర్యాలీలను నిషేధిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశంలో సెకండ్ కోవిడ్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.
పశ్చిమ బెంగాల్ లో రోడ్ షోలను, బైక్ ర్యాలీలను నిషేధిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశంలో సెకండ్ కోవిడ్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ఈ రాష్ట్రంలో మిగతా రెండు దశల ఎన్నికలు ఈ నెల 26 , 29 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. అయితే పాదయాత్రలు, రోడ్ షో లు, సైకిల్, బైక్ ర్యాలీలను తక్షణమే బ్యాన్ చేస్తున్నామని వెల్లడించింది. రాజ్యాంగంలోని 324 అధికరణం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అలాగే ఏ ప్రచార సభకైనా 500 మందికి మించి అనుమతించేది లేదని కూడా స్పష్టం చేసింది. ర్యాలీల వంటివాటికీ ఇదివరకే అనుమతి ఉన్నా ఆ అనుమతి రద్దయినట్టే భావించాలని ఈసీ సూచించింది. జనం పరిమిత సంఖ్యలో ఉండేలా చూడాలి.. పలురాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోవిడ్ రూల్స్ ని అతిక్రమిస్తున్నారు అని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. .
మరిన్ని ఇక్కడ చూడండి: ఆక్సిజన్ అయిపోవడానికి 3 గంటలే ఉంది, ఢిల్లీ ఆకుపత్రి బెడ్ పై నుంచి ఆప్ నేత వీడియో