ఇదేం కర్మరా బాబు..! ఎడమ కాలు నొప్పిగా ఉందని ఆస్పత్రికి వచ్చిన మహిళ.. కుడి కాలికి ఆపరేషన్ చేసిన డాక్టర్!
వెంటనే డాక్టర్‌ని పిలిచి నిలదీయగా, డాక్టర్ తన తప్పును గ్రహించాడు. ఎలాంటి సమస్యలు లేని తన కుడి కాలికి ఎలా సర్జరీ చేశారో అర్థం కావటం లేదంటూ బాధితురాలు సజీనా వాపోయారు.

వైద్యులు దేవుడితో సమానం అంటారు..అందుకే ‘వైద్యో నారాయణో హరిః’ అనే నానుడి అలానే వచ్చింది. అలాంటి డాక్టర్లు తప్పు చేస్తే పేషెంట్ల పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి దారుణ ఘటనే కేరళలో చోటుచేసుకుంది. పేషెంట్ రోగం ఒకటైతే, డాక్టర్ ట్రీట్మెంట్ మరోకటి చేశారు. దీంతో బాధితుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కేరళ రాష్ట్రం కక్కోడికి చెందిన సజినా సుకుమారన్ (60) ఎడమ కాలు మడమ నరానికి గాయం కావడంతో మావూరు రోడ్డులోని రాష్ట్రీయ ఆసుపత్రికి చెందిన డాక్టర్ బెహిర్షన్ చికిత్స అందించారు. ఎడమ కాలు మడమలో నొప్పి రావడంతో సర్జరీకి అంగీకరించిన సుజి.. సర్జరీ అనంతరం లేచి చూసేసరికి ఎడమ కాలుకు కాకుండా కుడి కాలికి ఆపరేషన్ చేసినట్లు తెలిసింది. ఏడాది క్రితం సజినా డోర్‌లో తగిలి ఎడమ కాలికి గాయమైంది. నొప్పి తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. తొలుత ఓ ప్రైవేట్ క్లినిక్‌లో డాక్టర్ బెహిర్షన్ చికిత్స అందించి ఫిబ్రవరి 20న ఆస్పత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 21న డాక్టర్ బెహిర్షన్ సజీనాకు శస్త్రచికిత్స చేశారు.
అనంతరం తాను స్పృహలోకి వచ్చి చూసుకోగా, తన కుడి కాలు బరువుగా అనిపించిందట. దాంతో తన ఎడమ కాలు నొప్పికి శస్త్రచికిత్స చేయించుకోవడానికి వస్తే.. తన కుడి కాలుకు ఆపరేషన్ జరిగిందని తెలిసింది. కుడి కాలుకు ఆపరేషన్ చేయడం చూసి తానే షాక్‌కు గురయ్యాయని చెప్పింది. తాను వెంటనే నర్స్ సాయంతో డాక్టర్‌ని పిలిచి నిలదీయగా, డాక్టర్ తన తప్పును గ్రహించాడు. ఎలాంటి సమస్యలు లేని తన కుడి కాలికి ఎలా సర్జరీ చేశారో అర్థం కావటం లేదంటూ బాధితురాలు సజీనా వాపోయారు.
కాగా, తన తల్లికి కుడి కాలులో కూడా బ్లాక్ ఉందని, కానీ, ఆ కాలులోని బ్లాక్‌ను గుర్తించడానికి డాక్టర్లు ఎలాంటి ఎక్స్-రే లేదా స్కాన్ తీసుకోలేదని సుజిన్నా కుమార్తె చెప్పారు. అయితే, దీనిపై డీఎంవో, ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు సుజీనా బంధువులు తెలిపారు. అయితే మహిళకు రెండు కాళ్లలో సమస్య ఉందని, శస్త్రచికిత్సకు ముందు ఈ విషయాన్ని సజినాకు, ఆమె భర్తకు తెలియజేశామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.




ఆసుపత్రి ఎండీ డాక్టర్ కె.ఎం.ఆషిక్ మాట్లాడుతూ.. మడమ నొప్పితో బాధపడుతున్న సజీనాకు కొన్ని రోజులుగా డాక్టర్ బెహిర్షన్ వద్ద చికిత్స అందిస్తున్నారు. సుజినా కుడి కాలును పరిశీలించిన తర్వాత ఆ కాలికి గాయం ఉన్నట్లు గుర్తించి సుజినాకు, ఆమె భర్తకు సమాచారం అందించారు. విషయం తెలిసిన తర్వాత సుజీనా స్వయంగా సర్జరీకి అంగీకరించింది అని ఆ పత్రిక పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
