ఆన్ లైన్ క్లాసుల నేపథ్యం……15 ఏళ్ళ ఆ విద్యార్ధిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారంటే …?
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ళ కుర్రాడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇతడు ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా మహిళా టీచర్లకు తన ప్రైవేటు భాగాలు చూపుతూ వచ్చాడట...
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ళ కుర్రాడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇతడు ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా మహిళా టీచర్లకు తన ప్రైవేటు భాగాలు చూపుతూ వచ్చాడట…ఫిబ్రవరి 15- మార్చి 2 తేదీల మధ్య ఈ-కోడింగ్ క్లాసులు జరుగుతుండగా.. ఈ విద్యార్ధి ఇలా అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. ఇతడి యవ్వారంపై ముంబైలోని సంకల్ప పోలీసు స్టేషన్ కు ఎవరో ఫిర్యాదు చేశారు. దీంతో ఇతని చిరునామా తెలుసుకుని పట్టుకునేందుకు ఖాకీలు నానా పాట్లు పడ్డారు. ముంబై అంతా గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు రాజస్థాన్ లోని జైసల్మీర్ లో ఇతడు ఉంటున్నట్టు తెలుసుకున్నారు. ఓ ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లినప్పటికీ ఒక పట్టాన ఇతని ఇంటిని వారు తెలుసుకోలేకపోయారు. అతి కష్టం మీద మొత్తానికి ఆ ఇంటిని చేరుకొని ఈ కుర్రాడ్ని పట్టుకున్నారు. తాము అడిగిన ప్రశ్నలకు ఈ స్టూడెంట్ చెప్పిన సమాధానం వారికి ఆశ్చర్యం కల్గించింది. ఈ -క్లాసుల సందర్బంగా తరచూ తన ముఖం కనబడకుండా దాక్కునేవాడట..
ఇంతకీ ఎందుకిలా చేశావని అడిగితే తడుముకోకుండా ‘ఫన్ కోసం’ అని జవాబిచ్చాడట… ఇతడి పైన పోలీసులు కేసు పెట్టారు. ఈ కోవిద్ తరుణంలో ఆన్ లైన్ క్లాసుల సందర్బంగా ఈ విధమైన ఫిర్యాదులు తమకు ఎక్కువగా వస్తున్నాయని పోలీసులు తెలిపారు. అందువల్లే తల్లిదండ్రులు తమ పిల్ల్లలను గమనిస్తుండాలని వారు కోరుతున్నారు. తరచూ వారికి కౌన్సెలింగ్ కూడా అవసరమని వారు సూచిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video
సంచయితకు హైకోర్టు షాక్ ..అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని ఆదేశం:MANSAS Trust Live Video.