ఆదిత్యానాథ్‌ థాక్రే పుట్టిన రోజు సందర్భంగా రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. బారులు తీరిన జనాలు..:petrol at Rs 1 per litre Video.

దేశంలో పెట్రోలక్ష్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ రేటు సెంచరీ దాటింది. దీంతో వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసేందుకు సామాన్య జనాలు భయపడుతున్నారు. అయితే..


దేశంలో పెట్రోలక్ష్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ రేటు సెంచరీ దాటింది. దీంతో వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసేందుకు సామాన్య జనాలు భయపడుతున్నారు. అయితే మహారాష్ట్రలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో లీటర్‌ పెట్రోల్‌ను రూపాయికే అందించారు. ఏంటి వంద రూపాయలు ఉన్న పెట్రోల్‌ రూపాయికే ఎలా ఇస్తారనేగా మీ అనుమానం. అసలు విషయం ఏంటంటే.. మహారాష్ట్ర మంత్రి ఆదిత్యానాథ్‌ థాక్రే పుట్టిన రోజు సందర్భంగా డోంబివ‌లీ యువ‌సేన ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో రూపాయికే పెట్రోల్‌ను అందించారు. దీంతో పెట్రోల్ కోసం వాహ‌న‌దారులు కిలోమీట‌ర్ల మేర బారులు తీరారు. ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకూ రెండు గంటల పాటు రూపాయికి లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు.వందలాది మంది వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: బ్రహ్మంగారి మఠంలో కొట్లాటలు మఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా శంకర్‌ బాలాజీకి బాధ్యతలు :Brahmamgari Matam Issue LIVE Video.

సంచయితకు హైకోర్టు షాక్ ..అశోక్‌ గజపతిరాజును పునర్నియమించాలని ఆదేశం:MANSAS Trust Live Video.

 పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.

 భారత్ నుండి బాంగ్లాదేశ్ కు 100 కి.మి నడిచి వెళ్లిన పులి..రేడియో కాలర్ ద్వారా తెలుసుకున్న అధికారులు :Tiger Viral Video.

Click on your DTH Provider to Add TV9 Telugu