Uttar Pradesh Politics: ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ముస్లిం ఓటర్లను ఆకర్షించే కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టిన కాంగ్రెస్

Uttar Pradesh Politics: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు.. ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రధాన విషయం ఇదే. వచ్చే సంవత్సరంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు వివిధ కారణాల రీత్యా చాలా కీలకం.

Uttar Pradesh Politics: ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ముస్లిం ఓటర్లను ఆకర్షించే కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టిన కాంగ్రెస్
Uttar Pradesh Politics

Uttar Pradesh Politics: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు.. ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రధాన విషయం ఇదే. వచ్చే సంవత్సరంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు వివిధ కారణాల రీత్యా చాలా కీలకం. అందుకే ఇప్పటి నుంచే యూపీ ఎన్నికలలో విజయం కోసం ఏమి చేయాలి.. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి? అభ్యర్ధుల ఎంపిక ఇటువంటి అన్ని విషయాలపై కసరత్తులు మొదలు పెట్టేసింది. వివిధ కులాలు, మతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారిని ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ భిన్నమైన ప్రణాళికలు వేసింది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, మదర్సాల్లో చదువుతున్న పిల్లలకు సహాయం చేయడం ద్వారా ముస్లిం ఓటర్ల మనస్సులో చొరబడటానికి కాంగ్రెస్ దృష్టి పెడుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మదర్సాల జాబితాను కూడా సిద్ధం చేశారు.
ముస్లిం ఓట్లే లక్ష్యంగా..
1990 నుండి కాంగ్రెస్ పార్టీలో ముస్లింలపై నిర్లక్ష్యం కారణంగా మైనారిటీ ఓట్లు ఎస్పీ, బిఎస్పి వైపు మళ్లడం ప్రారంభించాయని ఉత్తర ప్రదేశ్ మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షహ్నావాజ్ ఆలం చెప్పారు. కానీ ఈ పార్టీలలో కూడా ముస్లింలకు న్యాయం జరగలేదు. అదలా ఉంచితే, యూపీలో కాంగ్రెస్‌కు కూడా బలమైన ముస్లిం నాయకత్వం లేదు. ఈ కారణంగా, ముస్లిం ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ మరియు బిఎస్పిలతో కలిసి వెళ్ళవలసి వచ్చింది. రెండు పార్టీలు ఈ ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాయి. కాని ఇప్పుడు యూపీ కాంగ్రెస్‌కు ప్రియాంక గాంధీ రూపంలో మంచి నాయకత్వం లభించింది. అందువల్ల, ముస్లింలను కాంగ్రెస్‌తో అనుసంధానించే కార్యక్రమం కొత్తగా ప్రారంభమైంది.

5 పాయింట్లలో బ్లూ ప్రింట్..

  1. ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానించే ప్రచారం మదర్సాల నుంచి ప్రారంభమవుతుంది.
  2. గ్రామాల నుండి నగరాలకు వరకూ నడుస్తున్న రెండు లక్షల మదర్సాల జాబితాను తయారు చేశారు.
  3. పార్టీ కార్యకర్తలు ఈ మదర్సాలకు వెళ్లి ఉలేమాతో సమావేశాలు జరిపి మదర్సాల విద్యార్థులకు కాంగ్రెస్ విధానాలు మరియు
  4. ఎన్నికల ఎజెండా గురించి తెలియజేస్తారు.
  5. మదర్సాల విద్యార్థుల సహాయంతో పార్టీ కార్యక్రమాలను వారి ఇళ్లకు చేరుస్తారు.
  6. కరోనా కాలంలో సమస్యలను ఎదుర్కొన్న ముస్లింలకు పార్టీ సహాయం చేస్తుంది.

కాంగ్రెస్ ఓటు వాటా లెక్కలు ఇలా..

2017 అసెంబ్లీ ఎన్నికల్లో 47%, పార్లమెంట్ ఎన్నికల్లో 20 శాతం యాదవ్ ఓట్లు ఎస్పీతో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 28 నుంచి 30 శాతం ఓట్లు కాంగ్రెస్ పొందాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇందులో 30 శాతం ఓట్లు సాధిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభం అవుతుందని కాంగ్రెస్ లెక్క. దీనికి అదనంగా 20 శాతం ముస్లిం ఓటర్లను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేలా కోరుతారు. ఇక బ్రాహ్మణులూ, యాదవ్ కాని ఒబీసీలు, దళితులూ బీజేపీ తో ఉంటారు. అందుకే కాంగ్రెస్ ప్రస్తుతం ముస్లిం ఓబీసీపై దృష్టి పెట్టింది.

షానవాజ్ లెక్కల ప్రకారం, రాష్ట్రంలో సుమారు 8-10% యాదవులు ఉన్నారు, ముస్లిం ఓబిసిల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఇందులో అన్సారీల సంఖ్య బాగా ఎక్కువ. గోరఖ్‌పూర్‌లో సుమారు నాలుగు లక్షలు, మౌలో సుమారు మూడున్నర లక్షలు, బనారస్‌లో నాలుగు లక్షలు, ముబారక్‌పూర్ అజమ్‌గడ్ ‌లో రెండు లక్షలు, అంబేద్కర్ నగర్‌లో నాలుగు లక్షల అన్సారీలు ఉన్నాయి. మొత్తం ముస్లిం ఓబిసి జనాభాలో అన్సారీలు 60% ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి దేశంలో వారు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించారో వారికి కాంగ్రెస్ చెప్పాలని భావిస్తోంది. అన్సారీల తరువాత, ఎక్కువ జనాభా ఉన్న ఖురేషిలను ఓబిసి ముస్లింలతో అనుసంధానించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి, మోమిన్ కాన్ఫరెన్స్ ఉద్యమంతో సంబంధం ఉన్న నేత, పెద్ద నాయకుడైన అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ పుట్టినరోజున, ఈసారి కాంగ్రెస్ అనేక కార్యక్రమాలను నిర్వహించింది.

Also Read: కాంగ్రెస్ పార్టీకి సంస్కరణలు అవసరం….లేదంటే….? సీనియర్ నేత కపిల్ సిబల్ హెచ్చరిక

TPCC Chief: గాంధీ కుటుంబ విధేయులకే TPCC ఇవ్వండి.. సోనియాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖాస్త్రం

Click on your DTH Provider to Add TV9 Telugu