YSR Vahana Mitra: కష్టకాలంలో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఊరట.. రేపు వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ!

సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ నడుపుకుంటున్న వారికి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కష్టకాలంలో బాగా ఊరట కలిగిస్తోంది.

YSR Vahana Mitra: కష్టకాలంలో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఊరట.. రేపు వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ!
Ysr Vahana Mitra
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 14, 2021 | 9:35 PM

AP CM YS Jagan amount added in YSR Vahana Mitra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీసీ సర్కార్‌. పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ఆటో, కారు డ్రైవర్లకు ఏడాదికి పది వేల రూపాయల సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం జగన్‌ ఏలూరులో వైఎస్సార్ వాహన మిత్ర ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ నడుపుకుంటున్న వారికి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కష్టకాలంలో బాగా ఊరట కలిగిస్తోంది.

అన్న మాటకు కట్టుబడి నాలుగు నెలల్లోనే డ్రైవర్లకు అండగా నిలిచామన్నారు ఏపీ సీఎం జగన్‌. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర లబ్దిదారుకుల రూ.10 వేల రూపాయలను అందజేస్తున్నారు. వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున రూ.248.46 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ చేయనున్నారు. రేపు లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు. పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన చోటనే దాని అమలుకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయంగా అభివర్ణించారు.

ఏపీలో జగన్ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సొంత ఆటో, కారు డ్రైవర్లకు ఏడాదికి పది వేల రూపాయల సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐదేళ్లలో మొత్తం 50 వేల రూపాయలను అందిస్తామన్నారు సీఎం. ఈ ఏడాది వాహన మిత్ర పథకం ద్వారా రెండు లక్ష 48 వేల 468 మంది డ్రైవర్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంపిక చేశారు.

ఈ పథకం కింద ఈ ఏడాది 2,48,468 మందికి లబ్ధి చేకూర్చనున్నారు. వారిలో 2,07,974 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండటం విశేషం. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ ఉన్న అర్హులైన డ్రైవర్లకు వాహనాల మరమ్మతులు, బీమా తదితర ఖర్చుల కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.

గత ఏడాది 2,24,777 మంది లబ్ధిదారుల్లో ఈ ఏడాది 2,05,536 మంది అర్హులుగా తేలారు. వాహనాలను విక్రయించడం, ఇతరత్రా కారణాలతో 19,241మంది అనర్హులయ్యారు. వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కోసం ఈ ఏడాది కొత్తగా 46,237 మంది దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో 42,932 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం మీద పాత, కొత్త రిజిస్ట్రేషన్లు కలిపి 2,71,014 మంది దరఖాస్తులను పరిశీలించారు. వాటిలో 2,48,468 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం లబ్ధిదారుల్లో 83 శాతం మంది.. అంటే 2,48,468 మందిలో 2,07,974 మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారే ఉన్నారు.

Read Also….  CJI NV Ramana Yadadri tour: రేపు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించుకోనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్