Jaganna Vidya Kanuka: జగనన్న విద్యా కానుక కిట్ లో మరో సర్‌ప్రైజ్.. AP సర్కారు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు ప్రభుత్వం ఒక వినూత్న కానుకను అందించనుంది. ఇక మీదట 'జగనన్న విద్యాకానుక' కిట్‌లో ఒక చిన్నసైజ్ ఆక్స్‌ఫర్డ్‌..

Jaganna Vidya Kanuka: జగనన్న విద్యా కానుక కిట్ లో మరో సర్‌ప్రైజ్.. AP సర్కారు నిర్ణయం
Jagananna Vidya Kanuka
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 14, 2021 | 10:17 PM

Oxford English Mini Dictionary in Jagananna Vidya Kanuka : ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు ప్రభుత్వం ఒక వినూత్న కానుకను అందించనుంది. ఇక మీదట ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌లో ఒక చిన్నసైజ్ ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు ఇవ్వనున్నారు. నిఘంటువులను కొనుగోలు చేసేందుకు ఇవాళ పాలనా అనుమతిని ఇచ్చింది జగన్ సర్కారు. విద్యా కానుక కిట్‌లో ఇంగ్లిష్‌ – ఇంగ్లిష్‌ – తెలుగు డిక్షనరీ చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న మొత్తం 23.5 లక్షల మందికి విద్యార్థులకు నిఘంటువు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇలా ఉండగా, పిల్లలంతా బడికి వచ్చేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు జగనన్న కానుకల కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా నేపథ్యంలో రోజుకి 50 మంది విద్యార్థుల తల్లిదండ్రులను బడికి ఆహ్వానించి వారి చేతికి కిట్స్ అందజేస్తారు. బయోమెట్రిక్‌ పద్ధతిలో తల్లుల వేలిముద్ర లేదా ఐరిష్‌ తీసుకుంటారు. విద్యార్థికి అందించే ఒక్కో కిట్ కోసం 1,450 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

ఈ కిట్‌లో స్కూల్‌ బ్యాగ్‌, మూడు జతల యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు వర్క్‌ పుస్తకాలు , బెల్ట్‌, మూడు మాస్కులు ఉంటాయి. జగనన్న విద్యాకానుక యూనిఫామ్‌ల కుట్టుకూలి కోసం విద్యార్ధుల తల్లుల అకౌంట్‌లోకి రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది 650 కోట్లు జమ చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఆరో తరగతి నుంచి విద్యాకానుక కిట్ లో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కూడా జత కానుంది.

Read also : Peddireddy : జూలై 8న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’, సర్పంచ్‌లతో మంత్రి వీడియో కాన్ఫెరెన్స్.. సీఎం మెచ్చేలాపేరు తెచ్చుకోండని సూచన

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు