థర్డ్ కోవిద్ ముప్పు భయం…..ఢిల్లీలో సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు
థర్డ్ కోవిద్ భయంతో ఢిల్లీలోని ప్రైవేటు హాస్పిటల్స్ సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డాయి. కోవిద్ సెకండ్ వేవ్ సందర్బంగా తాము పడిన ఇబ్బందులను మళ్ళీ ఎదుర్కోకుండా ఇవి ఇప్పటి నుంచే ఇందుకు ఉద్త్యుక్తమయ్యాయి.
థర్డ్ కోవిద్ భయంతో ఢిల్లీలోని ప్రైవేటు హాస్పిటల్స్ సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డాయి. కోవిద్ సెకండ్ వేవ్ సందర్బంగా తాము పడిన ఇబ్బందులను మళ్ళీ ఎదుర్కోకుండా ఇవి ఇప్పటి నుంచే ఇందుకు ఉద్త్యుక్తమయ్యాయి. జైపూర్ గోల్డెన్ హాస్పిటల్, బాత్రా ఆసుపత్రి వంటి వాటిలో ఎక్కువ మంది కోవిద్ రోగులు మరణించారు. పైగా ఢిల్లీ హైకోర్టు…. తమ సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని గత నెలలో వీటిని ఆదేశించింది. 100 దానికి మించి బెడ్స్ గల అన్ని ఆసుపత్రులు ఇందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. నర్సింగ్ హోమ్ లు కూడా తమకు తగిన స్థాయిలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. కాగా కొన్ని హాస్పిటల్స్ బడ్జెట్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వీటికి ప్రభుత్వం కొంత మేర నిధులిచ్చి ఆదుకుంటుందని భావిస్తున్నారు. మరో వైపు భవిష్యత్ అవసరాల కోసం 420 టన్నుల స్టోరేజీ కెపాసిటీతో భారీ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు సంబంధించి ఐ జీ ఎల్ సంస్థతో చర్చలు జరిపారు.
కోవిద్ వైరస్ కి గురైన పిల్లలకు అవసరమైన వైద్య సౌకర్యాల కోసం స్పెషల్ బెడ్స్, ఆక్సిజనరేటెడ్ బెడ్స్ తో కూడిన ఆసుపత్రులను ఎంపిక చేస్తామని ఆయన ఇదివరకే ప్రకటించారు. మరోవైపు పీడియాట్రిక్స్ టాస్క్ ఫోర్స్ ను కూడా నియమించారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ..థర్డ్ కోవిద్ వేవ్ ప్రభావం వారిలో స్వల్పంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అల్లంత దూరంలో కనిపించిన అద్భుత దృశ్యం.. ఆకాశంలో ఎగిరేపళ్లెం.నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో .
జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video