AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Politics: కాంగ్రెస్ నుంచి ఆప్ లోకి హార్దిక్ పటేల్? గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ముఖచిత్రంగా హార్దిక్ ఉండే అవకాశం!

Gujarat Politics: వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు గుజరాత్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రతిసారీ మాదిరిగానే, ఈసారి కూడా వివిధ పార్టీలు రాష్ట్రంలోని మెజారిటీ పాటిదార్ వర్గాన్ని ఆకట్టుకోవడానికి సన్నాహాలు ప్రారంభించాయి.

Gujarat Politics: కాంగ్రెస్ నుంచి ఆప్ లోకి హార్దిక్ పటేల్? గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ముఖచిత్రంగా హార్దిక్ ఉండే అవకాశం!
Gujarat Politics
KVD Varma
|

Updated on: Jun 14, 2021 | 10:14 PM

Share

Gujarat Politics: వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు గుజరాత్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రతిసారీ మాదిరిగానే, ఈసారి కూడా వివిధ పార్టీలు రాష్ట్రంలోని మెజారిటీ పాటిదార్ వర్గాన్ని ఆకట్టుకోవడానికి సన్నాహాలు ప్రారంభించాయి. ఆదివారం, కాగ్వాడ్‌లోని ఖోదల్‌ధామ్‌లో పాటిదార్ సొసైటీ అధిపతుల సమావేశం కూడా జరిగింది, దీనిలో తదుపరి ముఖ్యమంత్రి పాటిదార్‌గా ఉండాలని వారంతా తీర్మానించుకున్నారు. దీంతో ఇప్పుడు గుజరాత్ ఎన్నికల రాజకీయాలు పాటిదార్ల చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాటిదార్లను తమవైపు తిప్పుకునే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా హార్దిక్ పటేల్ ను ఆప్ తమ ముఖ్యనేతగా ఫోకస్ చేయాలని భావిస్తోంది. గత కొద్దికాలంగా హార్దిక్ పటేల్ కాంగ్రెస్ ను వదిలి ఆప్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ను వదలి హార్దిక్ పటేల్ ఆప్ తొ కలవడం ఇక్కడ రాజకీయ వర్గాల్లో పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. ఎందుకంటే, గుజరాత్ పుర ఎన్నికల్లో ఓటమి తరువాత అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో హార్దిక్ పటేల్ పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అంతేకాదు హార్దిక్ కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే హార్దిక్ పటేల్ ఆప్ లోకి వెళ్ళే వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమంలో యువ, దూకుడు నాయకుడిగా పరిగణించబడుతున్న హార్దిక్ పటేల్ ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన ఏమీ సాధించలేదు. పౌర ఎన్నికలలో కాంగ్రెస్ శుభ్రంగా స్వీప్ చేయడానికి చాలా మంది కాంగ్రెస్ సభ్యులు హార్దిక్ కారణమని భావిస్తారు. ఇది పాటిదార్ సమాజానికి, హార్దిక్‌కు ఆందోళన కలిగించే విషయంగా మారింది. పాటిదార్ నాయకులు కూడా బీజేపీ తమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వదని భావిస్తున్నారు. ఈ కారణాలతో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ ను వీడేది ఖాయం అని భావిస్తున్నారు.

ఇప్పటికే పాటిదార్ల సమాజం నుంచి పెద్ద నాయకుడు గోపాల్ ఇటాలియా ఆప్ లో చేరారు. కానీ, పాటిదార్ల సమాజం ఆయనను సమర్ధ నాయకుడిగా పరిగణించరు. ఈ పరిస్థితిలో ఆప్ హార్దిక్ పటేల్ మీద ఆధారపదేందుకు మొగ్గు చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాటిదార్ల సమాజం కూడా హార్దిక్ ను తమ నాయకుడిగా చేసుకోవడం విషయంలో ఒక్కతాటి మీద ఉన్నట్టు చెబుతున్నారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ చేయడానికి పార్టీ ఒక సంస్థను ఏర్పాటు చేసింది, కానీ అది విజయవంతం కాలేదు. దీని నుండి ఒక పాఠం తీసుకొని, ఆప్ ప్రధాన కమిటీ పార్టీలో చురుకైన మరియు దూకుడుగా ఉన్న యువతను చేర్చడం ద్వారా వారిని ఇక్కడ ప్రధాన నాయకులుగా తెరమీదకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కారణంగా, పౌర ఎన్నికలకు ముందు గోపాల్ ఇటాలియాను రాష్ట్ర అధ్యక్షునిగా నిర్ణయించింది. దీంతో ఆప్ కూడా సూరత్‌లో విజయం సాధించింది, ఇప్పుడు పాటిదార్ రిజర్వేషన్ నాయకుడు హార్దిక్ పటేల్‌ను తన కోర్టులో తీసుకురావడానికి ఆప్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. చూడాలి భవిష్యత్ లో ఏం జరుగుతుందో.

Also Read: Uttar Pradesh Politics: ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ముస్లిం ఓటర్లను ఆకర్షించే కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టిన కాంగ్రెస్

రానున్న ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని… మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ సంచలన వ్యాఖ్యలు