CM KCR: మోదీ – అదానీ అనుబంధం.. సిసోడియా అరెస్టుపై స్పందించిన సీఎం కేసీఆర్..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియాకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌ను పక్కన పెట్టిన రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియాకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌ను పక్కన పెట్టిన రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. మార్చి 4వ తేదీ వరకు సిసోడియా సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సిసోడియా జవాబులు దాట వేశారని , ఆయన్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించారు. సిసోడియా రిమాండ్‌పై కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సీబీఐ ఇప్పటికే ఆయన ఇంట్లో పలుమార్లు తనిఖీలు చేసిందని, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుందని సిసోడియా తరపు న్యాయవాది వాదనలు విన్పించారు. సిసోడియాను ఇంకా విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విచారించిన కోర్టు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా అరెస్ట్ దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌ను విపక్షాలు తీవ్రంగా ఖండించగా .. బీజేపీ నేతలు పూర్తిగా సమర్ధిస్తున్నారు. అదానీ -మోదీ లింకుల వ్యవహారం నుంచి దృష్టి మరల్చడానికే మనీష్‌సిసోడియాను అరెస్ట్ చేశారని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. తనకు మూడు గంటల పాటు సీబీఐ,ఈడీని అప్పగిస్తే మోదీ, అమిత్‌షా , అదానీ జైల్లో ఉంటారని అన్నారు ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విపక్ష నేతలు విమర్శించగా.. చట్టం కంటే తామే గొప్పవాళ్లమన్న భావనలో ఆప్ నేతలు ఉన్నారని బీజేపీ కౌంటరిచ్చింది.
సంచలన వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్
సిసోడియా అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. చాలామంది సీబీఐ అధికారులే సిసోడియా అరెస్ట్‌ను వ్యతిరేకించారన్న కేజ్రీవాల్..సిసోడియాను అరెస్ట్ చేయాలని సీబీఐపై ఒత్తిడి తెచ్చారంటూ ట్వీట్ చేశారు.
ఖండించిన తెలంగాణ సీఎం కేసీఆర్
సిసోడియా అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు తెలంగాణ సీఎం కేసీఆర్ . అదానీ-మోదీ సంబంధాలు బయటపడుతాయన్న భయంతో ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని బీఆర్‌ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.
కేరళ సీఎం..
కేరళ సీఎం విజయన్ కూడా మనీష్ సిసోడియా అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని , ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పొంచి ఉందని విజయన్ ట్వీట్ చేశారు.
అయితే విపక్షాల ఆరోపణలను బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. న్యాయవ్యవస్థను ఆప్ నేతలు కించపరుస్తాన్నారని బీజేపీ విమర్శించింది. కోర్టుల కంటే తామే గొప్పవాళ్లమన్న భావనలో ఆప్ నేతలు ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..