Shashi Tharoor: శశి థరూర్ ప్రసంగానికి డిక్షనరీ తీసుకెళ్లిన యువకుడు.. ‘జోక్‌ను నిజం చేశావ్’ అంటూ నెటిజన్ల కామెంట్లు
సోషల్ మీడియాలో గానీ, పబ్లిక్ ఈవెంట్లలోగానీ ప్రసంగించే సమయంలో థరూర్ ఉపయోగించే ఇంగ్లిష్ పదాలకు అర్ధాలు వెతుక్కోవాలంటే చాలా మంది గూగుల్ లేదా డిక్షనరీలలో సెర్చ్ చేస్తుంటారు. సామాన్యులైతే థరూర్ ప్రసంగానికి హాజరైతే చేతిలో డిక్షనరీతోనే వెళ్లాలంటూ నెటిజన్లు జోకులు
ప్రముఖ రచయిత, కాంగ్రెస్ సీనయర్ నేత, తిరువనంతపురం ఎంపీ అయిన శశి థరూర్ ఎక్కడ, ఎప్పుడు ప్రసంగించినా ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఆంగ్ల భాషా పరిజ్ఞానం శ్రోతలకు గట్టి సవాళ్లను విధిస్తుంది. సోషల్ మీడియాలో గానీ, పబ్లిక్ ఈవెంట్లలోగానీ ప్రసంగించే సమయంలో థరూర్ ఉపయోగించే ఇంగ్లిష్ పదాలకు అర్ధాలు వెతుక్కోవాలంటే చాలా మంది గూగుల్ లేదా డిక్షనరీలలో సెర్చ్ చేస్తుంటారు. సామాన్యులైతే థరూర్ ప్రసంగానికి హాజరైతే చేతిలో డిక్షనరీతోనే వెళ్లాలంటూ నెటిజన్లు జోకులు వేస్తుంటారు. ఐతే ఇది జోక్ స్టేట్‌మెంట్ కాదని నిజమేనని రుజువు చేసే సంఘటన ఒకటి వెలుగుచూసింది. తాజాగా నాగాలాండ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌కు థరూర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి నిజంగానే డిక్షనరీ తీసుకుని వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
‘ది లంగ్‌లెంగ్ షో’ అనే టాక్ షోలో యువతతో ముచ్చడించడానికి శశి థరూర్ హాజరయ్యాడు. ఈ షోను ఆర్ లుంగ్‌లెంగ్ అనే వ్యక్తి నిర్వహిస్తుంటాడు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తి చేతిలోని డిక్షనరీని చూపుతూ.. కాంగ్రెస్ లీడర్ థరూర్ ప్రసంగాన్ని వినేందుకు నాగాలాండ్‌లోని ఓ వ్యక్తి నిజంగానే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీతో వచ్చాడంటూ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసేంత వరకు థరూర్ ప్రసంగానికి డిక్షనరీ తీసుకువెళ్లడమేనేది కేవలం జోక్ స్టేట్‌మెంట్ మాత్రమేనని అనుకున్నాను. కానీ అది నిజం అని నమ్ముతున్నానంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. నెటిజన్లు కామెంట్ సెక్షన్‌ను ఎమోజీలతో నింపేస్తున్నారు. కాగా నాగాలాండ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 22న కొహిమాలో శశి థరూర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగం, అవినీతి వంటి పలు అంశాలపై థరూర్ ప్రసంగించారు.
Someone in Nagaland literally brought Oxford Dictionary to my show to listen to Dr. @ShashiTharoor. ?
Bringing Dictionary along was just a joke statement until I saw this. pic.twitter.com/Qiz3E2sv3i
— R Lungleng (@rlungleng) February 26, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.