Dangerous Man: ముంబైలోకి ఎంటరైన ఉగ్రవాది సర్ఫరాజ్.. పోలీసులను అప్రమత్తం చేసిన ఎన్‌ఐఏ సిబ్బంది
విదేశాల్లో శిక్షణ పొందిన సర్ఫరాజ్ మెమోన్ అనే వ్యక్తి ముంబై చేరుకున్నట్లు ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ముంబై పోలీసులకు సమాచరాం అందించారు. అతడు దేశానికి చాలా ప్రమాదకరమని ఎన్ఐఏ ముంబై పోలీసులకు..
విదేశాల్లో శిక్షణ పొందిన సర్ఫరాజ్ మెమోన్ అనే వ్యక్తి ముంబై చేరుకున్నట్లు ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ముంబై పోలీసులకు సమాచరాం అందించారు. అతడు దేశానికి చాలా ప్రమాదకరమని ఎన్ఐఏ ముంబై పోలీసులకు తెలిపింది. ఈ మేరకు అతనికి సంబంధించిన వివరాలను ముంబై పోలీసులతోపాటు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులకు కూడా ఈమెయిల్ చేసింది. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం..
ఇండోర్‌కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్ర దాడులకు పాల్పడే అవకాశం ఉందని, దేశానికి చాలా ప్రమాదకరని ఎన్ఐఏ తెలియజేసింది. విదేశాల్లో శిక్షణ తీసుకుని తాజాగా ముంబై చేరుకున్నాడని, ముంబోపోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎన్‌ఐఏ సమాచారం అందించింది. ఈ క్రమంలో అతనికి సంబంధించిన ఫొటోతోపాటు, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఎల్‌సీ వంటి ఇతర వివరాల్ని పోలీసులకు ఈమెయిల్ ద్వారా అందజేసింది. వీలైనంత త్వరగా అతడిని పట్టుకోవాలని ఆదేశించింది.
కాగా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ శనివారం (ఫిబ్రవరి 25) ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీళ్లు సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించి అక్కడ ఆయుధ శిక్షణ తీసుకునేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రలోని థానే వెస్ట్‌కు చెందిన ఖలీద్ ముబారక్ ఖాన్ (21), తమిళనాడుకు చెందిన అబ్దుల్లా (26)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్ నుంచి అందిన ఆదేశాల మేరకు అక్రమంగా సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు ఆయుధ శిక్షణ కోసం వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి దగ్గరి నుంచి 2 తుపాకులు, 10 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక కత్తి, వైర్ కట్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా సర్ఫరాజ్ మెమోన్ అనే ఉగ్రవాది భారత్‌లోకి ప్రవేశించిన విషయం బయటపడింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఫిబ్రవరి 14, 2023న, టెర్రర్ మాడ్యూల్‌కు విధేయులైన కొంతమంది తీవ్రవాదులు ఉగ్రకార్యకలాపాలు నిర్వహిచండంపై శిక్షణ పొందడానికి ముంబై మీదుగా ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి పాక్‌కు వెళతారనే సమాచారం ఈ ఏడాది ఫిబ్రవరి 14న సీక్రేట్ ఏజెన్సీకి సమాచారం అందింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.