AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: వీడియో గేమ్ తీసుకున్నారన్న కోపంతో టీచర్ పై ఎటాక్.. పిడిగుద్దులతో విచక్షణా రహితంగా..

తల్లీ తండ్రి తర్వాత.. ఆ స్థానాన్ని గురువులకు కేటాయించారు మన పూర్వీకులు. మంచి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో వారిని ప్రయోజకులుగా చేయడంలో గురువుల బాధ్యత ఎనలేనిది. తన..

Trending Video: వీడియో గేమ్ తీసుకున్నారన్న కోపంతో టీచర్ పై ఎటాక్.. పిడిగుద్దులతో విచక్షణా రహితంగా..
Attack On Teacher
Ganesh Mudavath
|

Updated on: Feb 28, 2023 | 12:44 PM

Share

తల్లీ తండ్రి తర్వాత.. ఆ స్థానాన్ని గురువులకు కేటాయించారు మన పూర్వీకులు. మంచి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో వారిని ప్రయోజకులుగా చేయడంలో గురువుల బాధ్యత ఎనలేనిది. తన శిష్యుడు జీవితంలో అగ్రస్థానానికి చేరుకుంటే.. ఆ గురువుకు కలిగే సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. ఇంతలా పెనవేసుకుపోయిన గురుశిష్యుల బంధంలో కొందరు చేస్తున్న మూర్ఖపు పనులు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. టీచర్లపై స్టూడెంట్స్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్లాస్ లో తిట్టారనో, మార్కులు తక్కువగా వేశారనో, పరీక్షల్లో ఫెయిల్ చేశారనో.. ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలెన్నో.. దీంతో ఎటాక్స్ ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విద్యార్థి మాత్రం.. తన వీడియో గేమ్ తీసేసుకోవడంతో పట్టరాని కోపం వచ్చింది. అసిస్టెంట్ టీచర్(టీచర్స్ ఎయిడ్)పై రెచ్చిపోయి దాడి చేశాడు. ఫ్లోరిడాలోని మటాంజస్ హైస్కూల్ లో ఈ ఘటన జరిగింది. ఫ్లాగ్లర్ కౌటీ షెరిఫ్ కార్యాలయం ఈ దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ విడుదల చేసింది. స్కూల్లో వీడియో గేమ్ ఆడుతుండడంతో అసిస్టెంట్ టీచర్ దాన్ని తీసుకుని తరగతి నుంచి వెళ్తున్నారు. దీంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన 17 ఏళ్ల విద్యార్థి, టీచర్ ను గట్టిగా తోసేశాడు. ఆమె ఎగిరి దూరంలో కిందపడిపోయింది. తల నేలను గట్టిగా తాకడంతో స్పృహ కోల్పోయింది. అయినా కానీ విద్యార్థి ఆగలేదు. దాడి చేస్తూనే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ అయింది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ఉపాధ్యాయురాలిని ఇళా కొట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!