AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మళ్లీ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఓ మహిళ మెడలోనుంచి..

హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే బరితెగించిన చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలో ఉన్న బంగారం చైన్ తెంపుకుని పరారయ్యారు.

Hyderabad: మళ్లీ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఓ మహిళ మెడలోనుంచి..
Chain Snatching
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2023 | 9:50 AM

Share

హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే బరితెగించిన చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలో ఉన్న బంగారం చైన్ తెంపుకుని పరారయ్యారు. హబీబ్‎నగర్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఈ చైన్ స్నాచింగ్ జరగడం కలకలం రేపింది. గోకుల్ నగర్ బస్తీలో విజయ్ కుమారి (57) అనే మహిళా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. చైన్ స్నాచింగ్‎కు పాల్పడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడిని ఆమె ప్రతిఘటించింది. దీంతో నిందితుడు ఆమెపై దాడికి పాల్పడి.. మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును దొంగలించి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుడిని పట్టుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఎన్ని ప్రత్యేక టీమ్‎లు ఏర్పాటు చేసినా చైన్ స్నాచింగ్ జరుగుతుండటం.. ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..