Hyderabad: మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సై ని కాలితో తన్ని.. దుర్భాషలాడుతూ హంగామా..

మత్తులో జోగుతోన్న ఓ యువకుడు హైదరాబాద్‌లో వీరంగం సృష్టించాడు. తాగి కారు నడపడమే కాకుండా.. బ్రీత్‌ అనలైజ్‌ పరీక్షల్లో అడ్డంగా బుక్కయ్యాడు..పోలీసులపైనే బూతులతో విరుచుకుపడ్డాడు...

Hyderabad: మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సై ని కాలితో తన్ని.. దుర్భాషలాడుతూ హంగామా..
Drunk Young Man
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 28, 2023 | 1:07 PM

మత్తులో జోగుతోన్న ఓ యువకుడు హైదరాబాద్‌లో వీరంగం సృష్టించాడు. తాగి కారు నడపడమే కాకుండా.. బ్రీత్‌ అనలైజ్‌ పరీక్షల్లో అడ్డంగా బుక్కయ్యాడు..పోలీసులపైనే బూతులతో విరుచుకుపడ్డాడు. బంజారా హిల్స్ లో మద్యం మత్తులో ఈ యువకుడి వీరంగం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. బ్రీత్ అనలైజ్ పరీక్షలో తాగినట్లు తేలడంతో ఆ యువకుడిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రెచ్చిపోయిన గౌరవ్‌ అనే ఈ యువకుడు ట్రాఫిక్ ఎస్ ఐ ను నానా దుర్భాషలాడుతూ తనకు హైకోర్టు జడ్జి తెల్సునని…నీమేదే కేసుపెడతానని అంటూ నానా రచ్చ చేశాడు. కారుని సీజ్‌ చేసి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ట్రాఫిక్ పోలీసులు.

యువకుడికి బ్రీత్ అనలైజ్ పరీక్షలలో 94 పాయింట్లు వచ్చాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు పెట్టడంతో కోపంతో రెచ్చిపోయాడు. నేను నెలకు రూ.70 వేలు సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావా? ’ అంటూ ట్రాఫిక్ ఎస్సైపై మాటలతో విరుచుకుపడ్డాడు. ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తా’ అంటూ ఎస్సైని కాలితో తన్నాడు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడి పక్కన ఉన్న యువతి సైతం ఎక్కడా తగ్గలేదు. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ రెచ్చిపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ