Khammam: దుమ్ములేపుతున్న తేజ మిర్చి.. ఈ ఏడాదిలోనే రికార్డ్ రేటు
మిర్చి పంట ఘాటెక్కింది. కనీవిని ఎరుగని రీతిలో ధరలు పెరిగాయి. ఇంతకాలం రైతుల కళ్లలో నీళ్లు తెప్పించిన మిర్చి పంట.. మద్దతు ధరతో ఇప్పుడు వారిలో ఆనందాన్ని నింపుతోంది.
మిర్చీ ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చీ ధరలు విపరీతంగా పెరిగాయి. ఓవైపు ఎప్పటిలాగే పుష్కలంగా పంట చేతికొచ్చింది. యార్డులో కావాల్సినంత స్టాక్ ఉన్నా మిర్చీ ధర పైపైకి ఎగబాకుతోంది. ఖమ్మం మిర్చి మార్కెట్‌లో తేజ మిర్చి ధర రికార్డు రేంజ్‌కు చేరింది. క్వింటా ధర ఏకంగా 21,625 రూపాయలు పలికింది. ఎర్ర బంగారంతో మెరిసిపోయింది ఖమ్మం మిర్చి మార్కెట్. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధరగా చెప్తున్నారు. కొద్ది రోజులుగా పడిపోయిన మిర్చి ధరలు క్రమంగా పెరుగుతుండడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఈసారి అధిక వర్షాల కారణంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మిర్చి పంట దెబ్బతినడం, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తేజ మిర్చి ధర క్వింటాల్‌కు రూ.25వేలను దాటే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం మిర్చి సీజన్ రాష్ట్రంలో జనవరి నుంచి స్టార్టయ్యింది. ప్రజంట్ మిర్చి కోతలు పీక్ స్టేజీలో ఉండడంతో పెద్ద ఎత్తున మిర్చి మార్కెట్లకు వస్తోంది. తెలంగాణలో తేజ, యూఎస్ 341, వండర్ హాట్, 1048 మిర్చి తదితర రకాల మిర్చి గణనీయమైన విస్తీర్ణంలో సాగవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..