TS ECET 2023: తెలంగాణ ఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2023) నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 27న ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ..
తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2023) నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 27న ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మర్చి 2 నుంచి ప్రారంభమవుతుంది. పాలిటెక్నిక్, బీఎస్‌సీ మ్యాథ్స్ పూర్తిచేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీలో ప్రవేశాలకు ప్రతి యేటా ఈసెట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈసెట్‌కు దరఖాస్తు రుసుం ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.900గా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్ లింబాద్రి సూచించారు. ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
రూ.500 ఆలస్యం రుసుంతో మే 8వ తేదీ వరకు, రూ.2,500ల ఆలస్య రుసుముతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి మే 12వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే15 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసెట్ ప్రవేశ పరీక్ష మే 20న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారని లింబాద్రి తెలిపారు. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా మొదట్లోనే దరఖాస్తు చేసుకొని ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.