Telangan BJP: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ మిషన్‌ 90.. ఆపరేషన్‌ 2023.. భాగంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణలోని కీలక నేతలతో భేటీ అయింది.

Telangan BJP: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ..
Amit Shah Jp Nadda
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 28, 2023 | 12:37 PM

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ మిషన్‌ 90.. ఆపరేషన్‌ 2023.. భాగంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణలోని కీలక నేతలతో భేటీ అయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం ఈ కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ నేతలకు పలు విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత, పార్టీ బలోపేతం, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయడం, సహా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై జేపీ నడ్డా, అమిత్ షా చర్చించనుననారు.

ఇవి కూడా చదవండి

అలాగే, బిజెపి అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ నేతలకు అమిత్ షా, జేపీ నడ్డా దిశా నిర్దేశం చేయనున్నారు.

కాగా.. ఈ సమావేశానికి హాజరైన బండి సంజయ్, కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, డా. కే. లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి రామ్మోహన్ రావు, జితేందర్ రెడ్డి హాజరయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..