Congres President: కీలక తీర్మానం చేసిన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ.. తక్షణమే రాహుల్ గాంధీని..

Congres President: ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీని తక్షణమే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా

Congres President: కీలక తీర్మానం చేసిన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ.. తక్షణమే రాహుల్ గాంధీని..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 31, 2021 | 7:33 PM

Congres President: ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీని తక్షణమే జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని నేడు డిమాండ్ చేసింది. ఆ మేరకు ఆదివారం నాడు జరిగిన ఢిల్లీ పీసీసీ సమావేశంలో నేతలు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఢిల్లీ కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు పూర్వవైభం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత్వ విధానాలతో పరిపాలన కొనసాగిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే రాహుల్ నాయకత్వమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, ఇదే సమయంలో మరో రెండు తీర్మానాలను కూడా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చేశారు. రైతు ఉద్యమంలో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున చోటు చేసుకున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు జగదీష్ టైట్లర్, రమేష్ కుమార్, కృష్ణ తీత్, నరేంద్ర నాథ్, యోగానంద్ శాస్త్రి కిరణ్ వాలియా హరూన్ సహా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలందరూ హాజరయ్యారు.

Also read:

Team India: మొక్కు తీర్చుకున్న టీమిండియా ప్లేయర్.. సుబ్రహ్మణ్య స్వామికి తలనీలాలు సమర్పణ..

రష్యాలో విపక్ష నేత నావెల్నీ విడుదల కోరుతూ వేలమంది భారీ ర్యాలీ, అరెస్టులు.