Budget 2021 Live Streaming: నేడే కేంద్ర ఆర్ధిక బడ్జెట్.. లైవ్ టెలికాస్ట్‌ను ఇలా వీక్షించండి..పూర్తి వివరాలు
Budget 2021: నేడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 29వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా.. నేడు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు.
Budget 2021: నేడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 29వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా.. నేడు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇది కావడం విశేషం.
శుక్రవారం, ఎకనామిక్ సర్వే 2021ని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సమర్పించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ జీడీపీ వృద్ధి 11 శాతం ఉంటుందని అంచనా వేశారు. అదే సమయంలో, ఫైనాన్సియల్ ఇయర్‌లో ఆర్ధిక లోటు అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా. అటు సర్వేలో 2020-21 ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ది -7.7 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఈ ఏడాది పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణ ప్రజలతో పాటు ఎంపీలు బడ్జెట్ గురించి సమాచారాన్ని పొందేందుకు ఓ యాప్‌ను ప్రారంభించారు. దానికి ‘కేంద్ర బడ్జెట్ మొబైల్ యాప్’ అని నామకరణం చేశారు. ప్రస్తుతానికి ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచారు.
బడ్జెట్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ చూడొచ్చు..
మీ మొబైల్ ద్వారా బడ్జెట్ ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. అందుకోసం https://tv9telugu.com/live-tv ఈ లింక్‌ను క్లిక్ చేయాలి. ఆర్ధిక మంత్రి కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే లోక్‌సభ టివి, దూరదర్శన్, రాజ్యసభ టివి మొదలైన వాటిలో కూడా బడ్జెట్ ప్రసారం కానుంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా బడ్జెట్ చూడవచ్చు. టీవీ9 తెలుగు కూడా ఎక్స్‌క్లూజీవ్‌గా బడ్జెట్ 2021 సెషన్‌ను ప్రసారం చేస్తోంది.
టీవీ9 తెలుగు లైవ్ బ్లాగ్ : Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్
టీవీ9 తెలుగు లైవ్ టీవీ లింక్ : https://tv9telugu.com/live-tv