Union Budget 2021 Telugu Live: నిర్మలమ్మ పద్దుతో దేశ ప్రజలకు సమన్యాయం.. మౌలిక సదుపాయాలే లక్ష్యంః ప్రధాని మోదీ

| Edited By: Ravi Kiran

Updated on: Feb 01, 2021 | 4:16 PM

Budget 2021 LIVE news in telugu: పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనాతో కుదేలైన అన్ని రంగాలకు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

Union Budget 2021 Telugu Live: నిర్మలమ్మ పద్దుతో దేశ ప్రజలకు సమన్యాయం.. మౌలిక సదుపాయాలే లక్ష్యంః ప్రధాని మోదీ

Budget Telugu 2021 LIVE: కేంద్ర బడ్జెట్ 2021-22ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కరోనా తర్వాత ఆర్ధిక వ్యవస్థను తిరిగి పుంజుకునే చేసేలా నిర్మలమ్మ ఎలాంటి ప్రకటనలు చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే పెద్దగా ఈ బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేకపోగా.. కొత్తగా కొన్నింటిపై అమలులోకి అగ్రిసెస్ రానుంది. ఇక ముఖ్యంగా ఆరోగ్య రంగంపై కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

అటు ఈ బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. బడ్జెట్‏లో మౌలిక వసతులకు పెద్దపీట వేశారన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు నిర్మాలా సీతారామన్ చేయూతనిచ్చారని.. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని మోదీ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‏కు బడ్జెట్ విజన్‏లా పనిచేస్తుందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపవుతుందన్నారు.

ఇక నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎక్కువగా వైద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి సారించామని వెల్లడించారు. బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Feb 2021 04:16 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: బడ్జెట్‌తో బుల్ రన్..

    బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితి 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు

    మదుపర్లలో ఉత్సాహాన్ని నింపిన కేంద్ర నిర్ణయాలు

    లాభపడ్డ బ్యాంకింగ్ షేర్లు

    ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధులు ప్రకటించడంతో మార్కెట్లలో కొత్త జోష్

    కేంద్ర బడ్జెట్‌తో మార్కెట్‌లో జోష్

    ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణకు పెద్ద పీట వేసిన కేంద్రం

    బ్యాంకింగ్, బీమా రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం

    ఈ ఏడాదిలోనే LIC పబ్లిక్ ఇష్యూ

    ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం

  • 01 Feb 2021 03:52 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: బడ్జెట్‌పై బీహార్ సీఎం ప్రశంసలు..

    బీహార్ సీఎం నితీష్ కుమార్ 2021-22 బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను అభినందించారు. కోవిడ్ మహమ్మారి, ఆదాయ సేకరణలో సమస్యలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమతుల్య బడ్జెట్‌ను సమర్పించిందని నితీష్ అన్నారు.

  • 01 Feb 2021 03:22 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలైట్స్

    అగ్రిసెస్ వేటిమీద.?

    గోల్డ్, సిల్వర్ 2.5 శాతం

    ఆల్కహాల్ 100 శాతం

    క్రూడ్ పామ్ ఆయిల్ 17. 5 శాతం

    సోయా, సన్ ఫ్లవర్ వంట నూనెలపై 20 శాతం

    యాపిల్స్‌పై 35 శాతం

    బొగ్గు, ఇగ్నైట్‌పై 1.5 శాతం

    ఫెర్టిలైజర్స్‌పై 5 శాతం

    బఠాణీపై 40 శాతం

    పల్లీలు, శనగలపై 30 శాతం

    బెంగాల్ గ్రామ్ 50 శాతం

    కాయ ధాన్యాలపై 20 శాతం

    కాటన్‌పై 5 శాతం

  • 01 Feb 2021 03:03 PM (IST)

    దేశప్రజలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంది.. ప్రధాని నరేంద్ర మోదీ..

    దేశ ప్రజలకు న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని ప్రధాని మోదీ అన్నారు. బడ్జెట్‏లో మౌలిక వసతులకు పెద్దపీట వేశారన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు నిర్మాలా సీతారామన్ చేయూతనిచ్చారని.. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని మోదీ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‏కు బడ్జెట్ విజన్‏లా పనిచేస్తుందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపవుతుందన్నారు.

  • 01 Feb 2021 02:56 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ హైలైట్స్

    విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు కస్టమ్స్ డ్యూటీలో 2.5 శాతం కోత

  • 01 Feb 2021 02:48 PM (IST)

    కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‏లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‏లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లా లేదన్నారు. తమిళనాడు, కేరళ, అస్సాం, బెంగాల్ రాష్ట్రాలకు రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు కేటాయించారని.. మిగతా అన్ని రాష్ట్రాలకు దక్కాల్సిన సొమ్మును కొన్ని రాష్ట్రాలకే పంచుతున్నారని మండిపడ్డారు. ఈ బడ్జెట్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తయారు చేసినట్లుగా ఉందని ఉత్తమ్ అన్నారు. పెట్రలో మీద సెస్సుతో జనాన్ని బాదడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రలో ధరలతో జనాల నడ్డి విరుస్తున్నారన్నారు. అలాగే బడ్జెట్‏లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనడం పచ్చి అబద్ధమని వాపోయారు. దేశంలో ఏ రైతు ఆదాయం రెట్టింపు మాట దేవుడెరుగు కనీసం కొద్దిగా కూడా పెరగలేదని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పొందుపరిచిన హామీల సంగతి గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 01 Feb 2021 02:27 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలైట్స్

    గ్యాస్:

    వచ్చే మూడేళ్లలో వంద జిల్లాలకు గ్యాస్ పైప్ లైన్లు

    8 కోట్ల మంది జనాభాకు ఉచిత గ్యాస్

  • 01 Feb 2021 02:12 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌కి ఇదొక శరాఘాతం.. కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్..

    బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత  విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇదొక శరాఘాతం అని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ కనిపిస్తోందని చెప్పారు. ఎక్కడైతే ఎన్నికలున్నాయో ఆ రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు జరిపారని చెప్పుకొచ్చారు. మెట్రో రైల్ విషయంలో కొచ్చి, చెన్నై, బెంగళూరు ఇలా అన్ని చోట్లా ఇచ్చారు తప్ప ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై ఆత్మ నిర్భరత కనిపించడం లేదన్నారు విజయసాయిరెడ్డి.

    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల కేటాయింపు విషయంలో ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు.  ఖరగపూర్ – విజయవాడ ఫ్రైట్ కారిడార్ ఒక్కటే కనిపించిందని..దీని వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని చెప్పారు.  11 శాతం కూరగాయలు, పండ్లు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని.. అయినా కానీ కిసాన్ రైళ్లలో ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏపీకి ఒకటి ఇవ్వాలని కోరామని.. అయినా కనీస విలువివ్వకపోవడం బాధగా ఉందన్నారు.  ధాన్యం సేకరణకు సంబంధించి రూ. 4వేల కోట్ల పైన బకాయిలున్నాయని చెప్పుకొచ్చారు.  రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని… ప్రతి జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి కోరారు.

  • 01 Feb 2021 02:04 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: ధరలు పెరిగేవి.. తగ్గేవి.. ఇవే

    పెరగనున్న కార్ల స్పేర్ పార్ట్స్ ధరలు

    వెండి, బంగారం ధరలు తగ్గే ఛాన్స్

    తగ్గనున్న లెదర్ పర్సులు, బూట్ల ధరలు

    పెరగనున్న సెల్‌ఫోన్ ధరలు ( మొబైల్ పార్ట్స్ మీద 2.5 శాతం కస్టమ్స్ డ్యూటీ)

    స్వదేశీ దుస్తుల ధరలు తగ్గనున్నాయి

    సోలార్ లాంతర్ల ధరలు తగ్గనున్నాయి

    రాగి ధరలు తగ్గనున్నాయి

    పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

    పెరగనున్న ఆల్కహాల్ ధరలు

    పెరగనున్న సోయా, సన్‌ఫ్లవర్ వంటనూనెల ధరలు

    పెరగనున్న ఫెర్టిలైజర్స్ ధరలు

    బఠానీ, కాబూలీ, శెనగల ధరలు పెరగనున్నాయి

  • 01 Feb 2021 02:01 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ హైలైట్స్

    మొబైల్ ఫోన్స్

    పెరగనున్న సెల్ ఫోన్ ధరలు

    మొబైల్ స్పేర్ పార్ట్శ్‌పై 2.5 శాతం కస్టమ్స్ డ్యూటీ

    జీఎస్టీ

    జీఎస్టీ మరింత సరళీకరణ

    ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ. 10 కోట్లకు పెంపు

    స్పేర్ పార్టులు

    కార్ల విడిభాగాలపై ట్యాక్స్ పెంపు

    లెదర్:

    లెదర్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు

    గోల్డ్:

    బంగారం, వెండి ధరలు తగ్గుదల

    త్వరలో కస్టమ్స్ డ్యూటీ తగ్గించే అవకాశం

  • 01 Feb 2021 01:57 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ హైలైట్స్

    అక్టోబర్ 2021 నుంచి కొత్త కస్టమ్ డ్యూటీ పాలసీ

    2020లో 6.48 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్

  • 01 Feb 2021 01:54 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ హైలైట్స్

    దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్‌లు

    విద్యారంగంలో పరిశోధనలకు రూ. 50 వేల కోట్లు

    అసంఘిటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక పోర్టల్, రూ. 50 వేల కోట్లు

    త్వరలోనే కొత్త విద్యా విధానం అమలు

    డిసెంబర్ 2021 నాటికి తొలి మనవ సహిత ఉపగ్రహం

    త్వరలోనే నర్సింగ్ కమిషన్ బిల్లు

    ఈ ఏడాది ద్రవ్యలోటు 6.5 శాతం ఉంటుందని అంచనా

    ద్రవ్యలోటును పూడ్చడానికి మార్కెట్ల నుంచి నిధుల సేకరణ

    GST మరింత సరళీకరణ

    ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ. 10 కోట్లకు పెంపు

  • 01 Feb 2021 01:54 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ హైలైట్స్

    అభివృద్ధికి ఆరు సూత్రాలు

    1. వైద్య ఆరోగ్య రంగం

    2. మౌలిక రంగం

    3. సమ్మిళిత అభివృద్ధి

    4. మనవ వనరులు, నైపున్యాభివృద్ది

    5. ఇన్నోవేషన్ అండ్ R&D

    6. అందరికీ సుపరిపాలన

    విమాన రంగం:

    ఎయిర్ క్రాప్ట్ లీజింగ్ కంపెనీలకు ట్యాక్స్ మినహాయింపు

    స్టార్టప్:

    స్టార్టప్‌లకు ట్యాక్స్ హాలీడే ఏడాది పాటు పొడిగింపు

    వ్యవసాయం:

    వ్యవసాయ రంగానికి రూ. 75,100 కోట్లు

    వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 16.50 లక్షల కోట్లు

    ఇతరత్రా:

    చెన్నై, విశాఖలలో మేజర్ హర్బర్‌ల ఏర్పాటు

    దేశవ్యాప్తంగా వెయ్యి మార్కెట్లలో ఆన్లైన్ వ్యవస్థ

    వన్ నేషన్ - వన్ రేషన్‌తో 69 కోట్ల మందికి లబ్ది

    40 వేల కోట్లతో గ్రామీణ మౌలిక వసతులు

    చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 15,700 కోట్లు

    దేశవ్యాప్తంగా 15 వేల ఆదర్శ స్కూళ్లు, 100 సైనిక్ స్కూళ్లు

    లెహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు

  • 01 Feb 2021 01:37 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ హైలైట్స్

    ఆదాయ పన్ను:

    సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు

    ట్యాక్స్ ఆడిట్ నుంచి NRIలకు మినహాయింపు

    75 ఏళ్లు పైబడిన వారికి నో ట్యాక్స్

    డిజిటల్ చెల్లింపులకు టీడీఎస్ నుంచి మినహాయింపు

    ఇన్సూరెన్స్ రంగంలో భారీగా ఎఫ్డీఐలు..

    74 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి

    ఎఫ్డీఐల పరిమితి 49 నుంచి 74 శాతానికి పెంపు

    హౌసింగ్:

    గృహరుణాలపై వడ్డీ రాయితీ మరో ఏడాది పొడిగింపు

    అందరికీ గృహ సౌకర్యం కల్పించాలన్నదే లక్ష్యం

    బ్యాంకుల నిరర్ధక ఆస్తులపై కీలక నిర్ణయం

    మూలధన మద్దతు కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20 వేల కోట్లు

  • 01 Feb 2021 01:28 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: ట్యాక్స్ స్లాబ్‌లో మార్పులు

    ట్యాక్స్ స్లాబుల్లో పలు మార్పులు

    సీనియర్ సిటిజన్లకు ఊరట, పెన్షనర్లకు మాత్రమే వర్తింపు

    75 ఏళ్లు పైబడిన వారికి నో ట్యాక్స్

    సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ రితర్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు

    ఈ ఏడాది బడ్జెట్ అంచనా రూ. 34.83 లక్షల కోట్లు

    ఈ ఏడాది ద్రవ్యలోటు 6.5 శాతం ఉంటుందని అంచనా

    ట్యాక్స్ ఆడిట్ నుంచి NRIలకు మినహాయింపు

    చిన్న ట్యాక్స్ పేయర్ల వివాదాల పరిష్కారానికి ప్యానెల్

    డివిడెండ్లపై ఇకపై నో అడ్వాన్స్ ట్యాక్స్

    గృహ రుణాలపై వడ్డీ రాయితీ 2022 మార్చి వరకు కొనసాగింపు

  • 01 Feb 2021 01:19 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

    భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

    ఇక నుంచి పెట్రోల్, డీజిల్‌పై రూ. రెండున్నర అగ్రిసెస్

    పెట్రోల్ లీటర్ మీద రూ. 2.50 విధింపు

    డీజిల్ లీటర్ మీద రూ. 4 పెరుగుదల

  • 01 Feb 2021 01:13 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: సామాన్యులకు షాక్.. పెరగనున్న మొబైల్ ఫోన్ ధరలు

    కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మొబైల్ స్పేర్ పార్ట్శ్‌పై 2.5 శాతం కస్టమ్స్ డ్యూటీని ప్రకటించడంతో మొబైల్ ఫోన్ ధరలు పెరగనున్నాయి. అటు కార్ల విడిభాగాలు సైతం పెరుగుతాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ బడ్జెట్ అమలులోకి రానుండగా.. అప్పటి నుంచి దీని ధరలు పెరుగుతాయి.

  • 01 Feb 2021 01:10 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం మరో ఏడాది పొడిగింపు..

    ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. దీనితో గృహాల కొనుగోలుపై కేంద్రం ఇచ్చే రాయితీలు మార్చి 31 2022 వారు కొనసాగనున్నాయి. అలాగే తక్కువ ధరల్లో గృహాలు నిర్మించి ఇచ్చే సంస్థలకు సైతం పన్ను విరామం మరో ఏడాది పెరగనుంది. కాగా, ఈ పధకం 2015లో ప్రారంభమైన సంగతి తెలిసిందే

  • 01 Feb 2021 01:07 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: ఆదాయపన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట

    కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌లో ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట లభించలేదు. ఆదాయ పన్ను స్లాబుల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. గత స్లాబులే యధాతధంగా కొనసాగనున్నాయి.

  • 01 Feb 2021 01:04 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ ఇచ్చిన కేంద్రం

    రేషన్ కార్డుదారులకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ అందించారు. ప్రస్తుతం దేశంలో 32 రాష్ట్రాల్లో ఈ పధకం అమలులో ఉందని.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో వన్ నేషన్-వన్ కార్డును అమలు చేస్తామని ప్రకటించారు. వలస కార్మికులు ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకోవచ్చునని.. అలాగే కుటుంబసభ్యులు వేర్వేరు చోట ఉన్నప్పుడు వాటా ప్రకారం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

  • 01 Feb 2021 01:01 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    వచ్చే 3 ఏళ్లలో వంద జిల్లాలకు గ్యాస్ పైప్ లైన్

    ఇన్సూరెన్స్ కంపెనీలలో 74 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి

    ఆర్ధిక సంస్థల అభివృద్దికి రూ. 20 వేల కోట్లు

    విద్యుత్ రంగానికి రూ. 3.05 లక్షల కోట్లు

    రహదారుల నిర్మాణానికి రూ. 1.18 లక్షల కోట్లు

    ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20 వేల కోట్ల నిధులు

    స్టార్టప్‌లకు 128 రోజుల్లో అనుమతులు

  • 01 Feb 2021 12:54 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ రేషన్ అమలు.

    లేహ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు.

    2020 డిసెంబరు నాటికి విద్యుదుత్పత్తి సంస్థలకు.. పంపిణీ సంస్థలు రూ.1.35 లక్షల కోట్లు బకాయి.

    గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు రూ.300 కోట్లు.

    వచ్చే మూడేళ్లలో వంద జిల్లాలకు గ్యాస్ పైప్ లైన్

  • 01 Feb 2021 12:50 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరో 100 సైనిక పాఠశాలలు.

    హైదరాబాద్‌లో 40 వరకు ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి.

    దేశవ్యాప్తంగా 9నగరాల్లో ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి.

    వాటిని అనుసంధానిస్తూ ప్రత్యేక వ్యవస్థ.

    సామాజిక భద్రతా పథకాల్లోకి వీధి వ్యాపారులు.

    అంకుర సంస్థల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు.

    ఏకవ్యక్తి నిర్వహణ సంస్థలకు ప్రోత్సాహకాలు.

  • 01 Feb 2021 12:47 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం.

    కుటుంబసభ్యులు వేర్వేరు చోట ఉన్నప్పుడు వాటా ప్రకారం రేషన్ తీసుకునే అవకాశం.

    పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత జాబితా తయారు చేయాలని నీతిఆయోగ్‌కు ఆదేశం.

    వ్యూహాత్మక 4 రంగాలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ.

  • 01 Feb 2021 12:46 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు.

    గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి రూ.40 వేల కోట్లు.

    1,000 మండీలు ఈనామ్‌తో అనుసంధానం.

    రైల్వేలకు రూ.1,10,055 కోట్లు కేటాయింపు.

    బ్యాంకుల మొండి బకాయిల కోసం ఆస్తుల పునర్‌ వ్యవస్థీకరణ సంస్థ ఏర్పాటు.

    చిన్న సంస్థల నిర్వచనం మార్పు.

    రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకు చిన్నసంస్థలుగా గుర్తింపు.

    బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, మిగిలిన సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తిచేస్తాం.

  • 01 Feb 2021 12:38 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    కరోనా సంక్షోభ సమయంలోనూ పెట్టబుడల ఉపసంహరణ కొనసాగించాం.

    2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం.

    బీపీసీఎల్‌, ఎయిరిండియా, ఐడీబీఐ, పవనాన్స్‌ కంటైనర్‌ కార్పొరేషన్లలో పెట్టుబడుల ఉపసంహరణ.

    ఈ ఏడాదిలో ఎల్‌ఐసీ ఐపీవో.

    మూలధన మద్దతు కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20 వేల కోట్లు.

    మరో కోటిమంది లబ్ధిదారులకు ఎల్‌పీజీ ఉజ్వల్ యోజన.

    ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూరాయి.

  • 01 Feb 2021 12:36 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    దేశంలో వాయుకాలుష్య నియంత్రణకు రూ.2,217 కోట్లు.

    బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 నుంచి 74 శాతానికి పెంపు.

    పీపీపీ విధానంలో 7 పోర్టు ప్రాజెక్టులు2023 డిసెంబరు నాటికి దేశంలోని బ్రాడ్‌గేజ్ అంతా విద్యుదీకరణ.

    పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కోసం రూ.18 వేల కోట్లతో ప్రత్యేక పథకం.

    మరో 100 జిల్లాల్లో పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా వ్యవస్థ.

    విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కూడా పోర్టబులిటీ విధానం.

    శుద్ధ ఇంధన వనరుల విధానంలో భాగంగా హైడ్రోజన్ ఎనర్జీ మిషన్.

  • 01 Feb 2021 12:35 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: బడ్జెట్ 2021-22 హైలైట్స్

    రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2 లక్షల కోట్లు.

    జాతీయస్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌బోర్డు.

    కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి.

    రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అందుకోవాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి.

    6,835 ప్రాజెక్టులతో జాతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైపులైన్ ప్రారంభించాం.

    ప్రస్తుతం 7,40 ప్రాజెక్టులకు విస్తరించాం.

  • 01 Feb 2021 12:33 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: బడ్జెట్ 2021-22 హైలైట్స్

    కరోనా సమయంలో రూ.27.1 లక్షల కోట్లతో ప్యాకేజీలు ప్రకటించాం.

    ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను కాపాడి సంస్కరణలకు ఊతమిచ్చాయి.

    బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు.

    మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట.

    మౌలిక వసతులకు ఆదాయ వనరుల కోసం ప్రత్యేక సంస్థ.

    పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం.

    గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ.

  • 01 Feb 2021 12:33 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: బడ్జెట్ 2021-22

    కొత్తగా 11 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి

    తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు

    పశ్చిమ బెంగాల్‌లో రూ. 25 వేల కోట్లతో హైవేల అభివృద్ధి

    కేరళకు రూ. 65 వేల కోట్లతో అభివృద్ధి పనులు

    పశ్చిమ బెంగాల్‌లో 95 వేల కోట్లతో అభివృద్ధి పనులు

  • 01 Feb 2021 12:29 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    కేరళకు రూ. 65 వేల కోట్లతో అభివృద్ధి పనులు

    పశ్చిమ బెంగాల్‌లో 95 వేల కోట్లతో అభివృద్ధి పనులు

    తమిళనాడులో 3500 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ

    కొచ్చి, చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్‌లలో మెట్రో విస్తరణకు నిధులు

    విజయవాడ, ఖరగ్‌పూర్ మధ్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్

    2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్

  • 01 Feb 2021 12:23 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    2023 కల్లా రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి

    ఈ ఏడాది రైల్వేలకు రూ. 1.10 లక్షల కోట్లు

    మెట్రో రైల్ నెట్ వర్క్ అభివృద్ధికి రూ. 18 వేల కోట్లు

    పశ్చిమ బెంగాల్‌లో రూ. 25 వేల కోట్లతో హైవేల అభివృద్ధి

    అసోంలో రూ. 19 వేల కోట్లతో హైవేల అభివృద్ధి

    కేరళకు రూ. 65 వేల కోట్లతో అభివృద్ధి పనులు

  • 01 Feb 2021 12:22 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    పశ్చిమ బెంగాల్‌లో రూ. 25 వేల కోట్లతో హైవేల అభివృద్ధి

    అసోంలో రూ. 19 వేల కోట్లతో హైవేల అభివృద్ధి

    భారత్ మాల కింద 13 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి

    కేరళలో 1100 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి

    ఎన్నికల నేపధ్యంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు కేరళపై ఫోకస్

  • 01 Feb 2021 12:14 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    మొదటి ప్రాధాన్యతగా వైద్య ఆరోగ్య రంగం

    రెండో ప్రాధాన్యతగా మౌలిక రంగం

    మూడో ప్రాధాన్యత సమ్మిళిత అభివృద్ధి

    నాలుగో ప్రాధాన్యత మనవ వనరులు, నైపుణ్య అభివృద్ధి

    ఐదో ప్రాధాన్యత ఇన్నోవేషన్ అండ్ R&D

    6వ ప్రాధాన్యత అందరికీ సుపరిపాలన

  • 01 Feb 2021 12:09 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: వాహనాలపై కేంద్రం కీలక ప్రకటన

    కేంద్ర బడ్జెట్‌లో వాహనాల స్క్రాప్‌పై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

    దేశంలోని వాహనాల ఫిట్ నెస్ కోసం ప్రత్యేక పరీక్ష విధానం అమలు

    వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ల కాలపరిమితి

    కాలపరిమితి ముగిశాక వాహనానికి ఫిట్ నెస్ పరీక్ష తప్పనిసరి అనే నిబంధన

  • 01 Feb 2021 12:06 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    80మిలియన్ జనాభాకు ఉచిత గ్యాస్ కనెక్షన్...

    ఆత్మ నిర్భర్ భారత్ కు 21.17లక్షల కోట్లు..

    100 దేశాలకు కరోనా టీకాల పంపిణీ..

    ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ లక్ష్మీ కి 2.75లక్షల కోట్లు...

    ఆరోగ్య రంగానికి 64,180కోట్ల తో ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధి..

    ఆత్మనిర్భర భారత్ కోసం జీడీపీ లో 13శాతం మించి ఖర్చు..

    కాలం తీరిన వాహానాలు ఇక తక్కు కిందే...వ్యక్తి గత వాహానాలకు 20ఏళ్ళు ,కమర్షియల్ వాహానాలలకు 15ఏళ్ళ కాలపరిమితి...

    దేశ వ్యాప్తంగా 500నగరాలలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు..

    కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 35 వేల కోట్లు కేటాయింపు..

    బడ్జెట్ లో ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం తో లాభాల్లో ఫార్మా స్టాక్ మార్కెట్...

  • 01 Feb 2021 12:05 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    కొత్తగా 17 వేల అర్భన్, రూరల్ హెల్త్ సెంటర్లు

    వాయుకాల్యుషం నివారణకు రూ. 2,217 కోట్లు

    మూడేళ్లలో 7 టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు

    మూడో ప్రాధాన్యత సమ్మిళిత అభివృద్ధి

    నాలుగో ప్రాధాన్యత మనవ వనరులు, నైపుణ్య అభివృద్ధి

  • 01 Feb 2021 12:01 PM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం హైలైట్స్..

    • లాక్ డౌన్ లేకుంటే భారత్ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేది
    • అత్యవసర సేవల రంగంలో పనిచేసేవారు ప్రాణాలు అడ్డుపెట్టి పని చేశారు
    • కరోనా కట్టడిలో ప్రపంచానికి దిక్సూచిగా నిలిచాం
    • కరోనా కట్టడికి రెండు వ్యాక్సిన్లు తెచ్చాం
    • ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తున్నాం
    • మరో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొస్తాం
    • 8 కోట్ల మంది జనాభాకు ఉచిత గ్యాస్
    • గరీబ్ కళ్యాణ్ పధకం ద్వార పేదలను ఆదుకున్నాం
    • భారత ఆర్ధిక వ్యవస్థకు ఈ బడ్జెట్ కొత్త ఊతమిస్తుంది
  • 01 Feb 2021 11:53 AM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    • రక్షిత మంచినీటి పధకాల కోసం రూ. 87 వేల కోట్లు
    • కొత్తగా 17 వేల అర్భన్, రూరల్, హెల్త్ సెంటర్లు
    • మొదటి ప్రాధాన్యతగా వైద్య ఆరోగ్య రంగం
    • రెండో ప్రాధాన్యతగా మౌలిక రంగం
  • 01 Feb 2021 11:50 AM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కేంద్ర బడ్జెట్ 2021-22 హైలెట్స్

    • రూ. 64,180 కోట్లతో పీఎం ఆత్మనిర్భర్ ఆరోగ్య పధకం
    • 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు
    • ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం
    • 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు
    • దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబులు
    • రక్షిత మంచినీటి పధకాల కోసం రూ. 87 వేల కోట్లు
  • 01 Feb 2021 11:45 AM (IST)

    Corona Vaccine Budget 2021 Live Updates: కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ. 35 వేల కోట్లు

    కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ. 35 వేల కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరో రెండు స్వదేశీ వ్యాక్సిన్లు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. ఇంకా ఆరోగ్య రంగానికి బడ్జెట్ 137 శాతం పెరిగి 94,000 కోట్ల నుంచి రెండు లక్షల 22 వేల కోట్లకు చేరింది. ఇది ఆర్థిక పునరుజ్జీవనానికి కూడా సహాయపడుతుంది.

  • 01 Feb 2021 11:40 AM (IST)

    కరోనా వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్లు..

    • రూ. 64,180 కోట్లతో పీఎం ఆత్మనిర్భర్ ఆరోగ్య పధకం
    • 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు
    • కరోనా వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్లు
    • కొత్తగా ఇన్నోవేషన్ అండ్ R & D సెంటర్లు
  • 01 Feb 2021 11:36 AM (IST)

    కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2021-22 హైలెట్స్

    • జిల్లాల్లో కొత్తగా హెల్త్ ల్యాబ్‌లు
    • రూ.2.87 లక్షల కోట్లతో జల్ జీవన్ పధకం
    • కొత్తగా నగర్ స్వచ్ఛ్ భారత్ మిషన్
  • 01 Feb 2021 11:32 AM (IST)

    కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2021-22 హైలెట్స్

    • నేషన్ ఫస్ట్‌లో రైతుల ఆదాయం రెట్టింపు
    • మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం
    • ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం
  • 01 Feb 2021 11:27 AM (IST)

    కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2021-22 హైలెట్స్

    • ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది
    • ఆత్మ నిర్భర్ భారత్ కొత్త ఐడియా ఏం కాదు
    • వందల ఏళ్ల కిందటే మనం స్వయం సంవృద్ది సాధించాం
  • 01 Feb 2021 11:23 AM (IST)

    కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2021-22 హైలెట్స్

    • ఆర్ధిక పునరుజ్జీవమే ప్రభుత్వ లక్ష్యం
    • ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది
    • పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ. 2.75 లక్షల కోట్ల సాయం
  • 01 Feb 2021 11:17 AM (IST)

    బడ్జెట్‌లో టీమ్ ఇండియా ప్రస్తావన..

    ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా మాదిరిగానే దేశం ఆర్ధిక వ్యవస్థ కూడా పుంజుకుంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు

  • 01 Feb 2021 11:16 AM (IST)

    కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2021-22 హైలెట్స్

    • కరోనా తర్వాత ప్రపంచం మారుతోంది
    • ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా మాదిరిగానే ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంది
  • 01 Feb 2021 11:12 AM (IST)

    కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2021-22 హైలెట్స్

    • ఆత్మ నిర్భర్ భారత్‌లో రూ. 21.17 లక్షల కోట్లు కేటాయించాం
    • గరీబ్ కళ్యాణ్ యోజన, ఆత్మ నిర్భర్ భారత్‌కు ఐదు బడ్జెట్‌ల నిధులు
    • కరోనా నిర్వరణకు దేశంలో రెండు వ్యాక్సిన్లు
    • మరికొన్ని త్వరలోనే రాబోతున్నాయి
  • 01 Feb 2021 11:10 AM (IST)

    పార్లమెంట్ ముందుకు కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2021-22

    • గతంలో ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ ప్రసంగం
    • పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ. 2.75 లక్షల కోట్ల సాయం
    • కరోనా పోరాటంలో ఉద్యోగులంతా అండగా నిలిచారు
    • ఎంపీలు, ఎమ్మెల్యేలు జీతాలను విరాళంగా ఇచ్చారు
  • 01 Feb 2021 11:08 AM (IST)

    పార్లమెంట్ ముందుకు కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2021-22

    • బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
    • మేడిన్ ఇండియా ట్యాబ్ లో 2021-22 బడ్జెట్
    • 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి
    • ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తయారైన ట్యాబ్
  • 01 Feb 2021 11:07 AM (IST)

    బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

    పార్లమెంట్ ముందుకు కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2021-22. బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

  • 01 Feb 2021 11:02 AM (IST)

    బిట్‌కాయిన్‌పై కీలక ప్రకటన రానుందా.?

    బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీని నిషేధించడానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉంది

  • 01 Feb 2021 11:02 AM (IST)

    బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర..

    2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. చరిత్రలో తొలిసారిగా ఈసారి బడ్జెట్‌ కాగితరహితం డిజిటల్ రూపంలో ఉండబోతుంది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్‌ బడ్జెట్ పత్రాలను ముద్రణ చేపట్టలేదు. తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్ రూపొందించిన బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కూడా బడ్జెట్‌ పత్రాలకు బదులు ల్యాప్‌టాప్‌తో పార్లమెంట్‌కు చేరుకున్నారు.

  • 01 Feb 2021 10:59 AM (IST)

    రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఆర్ధిక మంత్రి ఏం ప్రకటన చేయబోతున్నారు.!

    రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సాధారణ బడ్జెట్‌లో పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉంది

  • 01 Feb 2021 10:58 AM (IST)

    పార్లమెంటుకు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు చేరుకున్నారు, కేబినెట్ సమావేశం ప్రారంభమైంది

  • 01 Feb 2021 10:47 AM (IST)

    పార్లమెంట్‌కు చేరుకున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

    2021-22 బడ్జెట్‌ను సమర్పించడానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ చేరుకున్నారు. వారితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పార్లమెంట్ చేరుకున్నారు.

  • 01 Feb 2021 10:39 AM (IST)

    బ్యాంకింగ్ స్టాక్స్‌పై బడ్జెట్ జోష్..

    మరికాసేపట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపధ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలోనే అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పుంజుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్‌తో సహా అన్నీ కూడా లాభాల్లో పయనిస్తున్నాయి.

  • 01 Feb 2021 10:37 AM (IST)

    కరోనా కారణంగా ఈ ఏడాది పేపర్‌లెస్ బడ్జెట్..

    1947 నవంబరు 26న తొలిసారి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏటా బడ్జెట్‌ పత్రాల ముద్రణ చేపడుతున్నారు. బడ్జెట్‌ సమావేశానికి రెండు వారాల ముందు ఈ ప్రింటింగ్‌ మొదలుపెడతారు. అయితే ఈసారి కరోనా కారణంగా బడ్జెట్‌ పత్రాల ముద్రణ చేపట్టకూడదని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు పార్లమెంట్‌ ఉభయసభల సభ్యులు కూడా సమ్మతించడంతో ప్రింటింగ్‌ చేపట్టలేదు. అందుకు బదులుగా సభ్యులందరికీ బడ్జెట్‌ సాఫ్ట్‌ కాపీలు ఇవ్వనున్నారు.

  • 01 Feb 2021 10:29 AM (IST)

    2021-22 బడ్జెట్‌పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఏమన్నారంటే..

    2021-22 బడ్జెట్‌ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. 'సబ్‌కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌' నినాదాలు మోదీ ప్రభుత్వ అజెండా అన్నారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటన భారతదేశానికి కొత్త దిశను ఇచ్చిందని, మహమ్మారి నుంచి రక్షణ కల్పిస్తుందని, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తీసుకువస్తుందన్నారు.

  • 01 Feb 2021 10:28 AM (IST)

    బడ్జెట్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ చూడొచ్చు..

    మీ మొబైల్ ద్వారా బడ్జెట్‌ ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. అందుకోసం https://tv9telugu.com/live-tv ఈ లింక్‌ను క్లిక్ చేయాలి. ఆర్ధిక మంత్రి కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే లోక్‌సభ టివి, దూరదర్శన్, రాజ్యసభ టివి మొదలైన వాటిలో కూడా బడ్జెట్ ప్రసారం కానుంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా బడ్జెట్ చూడవచ్చు. టీవీ9 తెలుగు కూడా ఎక్స్‌క్లూజీవ్‌గా బడ్జెట్ 2021 సెషన్‌ను ప్రసారం చేస్తోంది.

    టీవీ9 తెలుగు లైవ్ బ్లాగ్ Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

    టీవీ9 తెలుగు లైవ్ టీవీ లింక్ : https://tv9telugu.com/live-tv

  • 01 Feb 2021 10:17 AM (IST)

    'డిజిటల్ లెడ్జర్'తో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

    ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ కరోనా కాలంలో మొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించేందుకు సిద్దమయ్యారు. నిర్మలా సీతారామన్ ఈరోజు ట్యాబ్ ద్వారా ఆర్ధిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

  • 01 Feb 2021 09:53 AM (IST)

    మొదటి ప్రతిని రాష్ట్రపతికి సమర్పించనున్న ఆర్ధిక మంత్రి

    నార్త్ బ్లాక్‌లోనే ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటి అనంతరం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలిసేందుకు నిర్మలా సీతారామన్ బయల్దేరారు.

  • 01 Feb 2021 09:44 AM (IST)

    బడ్జెట్ పత్రాలను అందించేందుకు రాష్ట్రపతిని కలవనున్న ఆర్ధిక మంత్రి

    కరోనా మహమ్మారి కారణంగా మొత్తం అన్ని రంగాలు కుదేలయ్యాయి. దీనితో మళ్లీ వాటిని సొంత కాళ్లపై నిలబడేలా నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రజలందరికీ ఆర్ధిక టీకా కానుందని అంచనా వేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడంతో పాటు అన్ని రంగాలకు సమన్వయంగా కేటాయింపులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

  • 01 Feb 2021 09:31 AM (IST)

    బడ్జెట్ ఎఫెక్ట్.. పుంజుకున్న నిఫ్టీ, సెన్సెక్స్

    ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. నిఫ్టీ 100 పాయింట్లు, సెన్సెక్స్ 500 పాయింట్లు బలపడ్డాయి.

  • 01 Feb 2021 09:20 AM (IST)

    బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇవే..

    కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పేపర్‌లెస్ బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే ఈ బడ్జెట్‌లో పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అవేంటంటే..

    • స్వావలంబన భారతదేశం
    • పీఎల్‌ఐ సబ్సిడీ పథకం
    • ఆరోగ్య పథకం
    • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
    • ఎరువులు
    • ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన
  • 01 Feb 2021 09:03 AM (IST)

    ఆర్థిక శాఖ కార్యాలయం చేరుకున్న నిర్మల

    పార్లమెంటులో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా కార్యాలయానికి ముందుగానే వెళ్లారు.

  • 01 Feb 2021 08:46 AM (IST)

    బడ్జెట్ 2021: స్టార్టప్స్ ఆశలు నెరవేరేనా?

    స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్లో ఫిబ్రవరి 1న రాబోయే బడ్జెట్‌పై భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. బడ్జెట్​లో తుది వినియోగదారులకు ప్రోత్సాహకాలు ప్రకటించటం ద్వారా పారా-ఎడ్యూకేషన్ అంకురాలకు మద్దతు ఇవ్వాలని పలువరు వ్యాపారవేత్తలు కోరుతున్నారు.

  • 01 Feb 2021 08:34 AM (IST)

    తాజా బడ్జెట్‌పై పర్యాటక రంగం గంపెడు ఆశలు

    కొవిడ్​-19 సంక్షోభం మధ్య సోమవారం 2021-22 బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆర్థికంగా పీకల లోతులో కూరుకుపోయిన పర్యటకం, ఆతిథ్య రంగం.. ఈ బడ్జెట్​లో చేయూతను కోరుకుంటోంది. లాక్​డౌన్​ కాలానికి అనుమతుల రుసుముల మినహాయింపు, హోటళ్లు, రెస్టారెంట్లపై ఇన్​పుట్​ క్రెడిట్​తో 10 శాతంగా ఒకే విధమైన జీఎస్​టీ రేట్లతో పాటు ఇతర ఉపశమన చర్యలు ప్రకటిస్తారని ఆశిస్తోంది.

  • 01 Feb 2021 08:02 AM (IST)

    ఈసారి ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు..?

    ఈసారి ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఆదాయ పరిమితి పెంపుపై వేతనజీవులకు ఊరట ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గరిష్ట పన్ను స్లాబ్స్‌లోని వారికి కరోనా సెస్ ఉండవచ్చు. రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రూ.8 వేలకు పెంచే అవకాశముంది. వ్యవసాయరంగ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తారు. బంగారం దిగుమతులపై సుంకాల తగ్గించవచ్చు. దేశీయంగా వైద్య, విద్యుత్తు ఉపకరణాలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్, రక్షణ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు ప్రకటించే ఛాన్స్ ఉంది

  • 01 Feb 2021 07:39 AM (IST)

    ఈసారి పార్లమెంట్​ బడ్జెట్​ సెషన్​(తొలి భాగం) ఫిబ్రవరి 13 వరకే

    ఈసారి పార్లమెంట్​ బడ్జెట్​ సెషన్​(తొలి భాగం) ఫిబ్రవరి 13నే ముగియనున్నట్లు తెలుస్తోంది. అనంతరం.. మార్చి 8- ఏప్రిల్​ 8 మధ్య రెండో సెషన్​ నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాజ్యసభ సమావేశాలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి.

  • 01 Feb 2021 07:36 AM (IST)

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షెడ్యూల్​ ఇదే..

    • ఉదయం 8.45 గం. : తన ఇంటి  నుంచి నేరుగా పార్లమెంట్​ నార్త్​ బ్లాక్​లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి బయల్దేరుతారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.
    • ఉదయం 9.00: నార్త్​ బ్లాక్​లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​తో నిర్మల భేటీ
    • ఉదయం 9.30: రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసి, బడ్జెట్​ మొదటి ప్రతిని అందించనున్నారు నిర్మలా సీతారామన్​.
    • ఉదయం 10.00: బడ్జెట్​ ప్రతులతో నిర్మలా సీతారామన్​, అనురాగ్​ ఠాకూర్​ పార్లమెంటుకు బయల్దేరుతారు.
    • ఉదయం 10.15: పార్లమెంటులోని గేట్​ నెం.1కు చేరుతారు.
    • ఉదయం 10.30: బడ్జెట్​, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్​ సమావేశం కానుంది.
    • ఉదయం 11.00: లోక్​సభలో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్​.

Follow us
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..