Bandi Sanjay : మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా నిర్మలమ్మ బడ్జెట్.. పొగచూరిన జీవితాలకు ఇది వెలుగు రేఖ..

పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలే బడ్జెట్ ఉందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మొట్ట మెదటి సారిగా బడ్జెట్‌ను ఆరు భాగాలుగా విభజించి...

Bandi Sanjay : మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా నిర్మలమ్మ బడ్జెట్.. పొగచూరిన జీవితాలకు ఇది వెలుగు రేఖ..
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 03, 2021 | 5:28 PM

Bandi Sanjay : ఆత్మనిర్భర భారత్‌లో రూ.21.17 లక్షల కోట్లు కేటాయించారని తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలిపింది. ఈ దేశం మూలాల్లో ఆత్మనిర్భర్ భారత్ ఉందని గుర్తు చేశారు. యూనియన్‌బడ్జెట్ 2021 ఆశావాదంతో నిండి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అభిప్రయాపడ్డారు. ఇది సబ్ కా విశ్వస్ లక్ష్యంతో బడ్జెట్ నిర్మించారిని తెలిపారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌ సభలో ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్‌ ను బీజెపీ రాష్ట్ర శాఖ స్వాగతించింది. దేశ ప్రజల అంచనాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించే విధంగా దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలే బడ్జెట్ ఉందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మొట్ట మెదటి సారిగా బడ్జెట్‌ను ఆరు భాగాలుగా విభజించి ప్రతీ రంగానికి ప్రత్యేక నిధులు మరియు విధానపర నిర్ణయాలు ప్రకటించడం ద్వారా 2021-22లో భారత ఆర్ధిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో సందేహం లేదని అన్నారు.

అదనంగా మరో కోటి మందికి మహిళల కు ఉజ్వల పథకం కింద ఉచిత సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వరా పొగచూరిన మహిళల జీవితాలలో వెలుగులు నింపిన బడ్జెట్ అని పేర్కొన్నారు. కరోనాతో నెమ్మదించిన దశ ఆర్ధిక వ్యవస్థకు మళ్లీ ఉరుకులు పెట్టించే బడ్జెట్ అని తెలిపారు. కరోనా తర్వాత ప్రజల్లో భారత ప్రగతిపై విశ్వాసం పెంచేలా ఈ బడ్జెట్ను రూపొందించారు అని అన్నారు. కరోనా నేర్పిన పాఠంతో… ఆరోగ్యరంగానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసిందని అన్నారు.

కరోన మహమ్మారితో ప్రపంచ ఆర్ధిక వ్యస్థ అతలాకుతమవుతున్న తరుణంలో భారత దేశం అభివృద్ది దిశగా ముందడుగు వేయడం శుభసూచకం అని ఎంపీ బండి సంజయ్ అన్నారు. అభివృద్ది చెందిన దేశాలో సైతం ఆర్ధిక పరిస్థితి కుదేలై కొనుగోలు శక్తి పడిపోయిని ఈ పరిస్థితులో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే విధంగా అర్ధిక వ్యవస్థను గాడిలోకి రావడం గౌరవ ప్రధాని నరేంద్రమోది తీసుకున్న నిర్ణయాలతోనే సాధ్యం అయిందని పేర్కొన్నారు.

కోవిడ్ వైరస్ ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. డిజిటల్‌ పద్ధతిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మల.. గంటా 51 నిముషాలపాటు ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!