Budget 2021 : వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే కొత్త సెస్.. ప్రజలందరిపైనా ఉండదన్న కేంద్ర ఆర్థిక కార్యదర్శి
అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు మంత్రి నిర్మలా పేర్కొన్నారు.
New Agri infra cess : బడ్జెట్‌లో పన్ను విధింపుల్లో హెచ్చు తగ్గులు లేకపోయినా.. కొత్తగా సెస్ ద్వారా వసూళ్లు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్లాన్ చేసింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. ఆ కొత్త సెస్ పేరు అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్. ఈ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు మంత్రి నిర్మలా పేర్కొన్నారు. ఈ సెస్‌ను దేశంలోని ప్రతి ఒక్కరూ వినియోగించే వస్తువులైన పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్, బంగారం, వెండి, పప్పులు, ఆపిల్స్, పామాయిల్ వంటి వాటిపై విధించనున్నారు.
అయితే, ఈ కొత్త సెస్ ద్వారా ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. తద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగంలో ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఏబీ పాండే వెల్లడించారు. అయితే ఈ సెస్‌ను సగటు పౌరుడిపై ఎలాంటి భారం మోపకుండా రూపొందించినట్లు ఆయన చెప్పారు.
We are expecting Rs 30,000 crores through Agriculture Infrastructure and Development Cess. This cess has been designed such a manner that it won’t impact common man: Finance Secretary AB Pandey pic.twitter.com/As9IgaWLeu
— ANI (@ANI) February 1, 2021