Budget 2021: ఈ బడ్జెట్‌తో పెద్ద కంపెనీలకే లాభం.. ప్రజల సమస్యలు పెరుగుతాయ్.. కేజ్రీవాల్ ట్విట్
Arvind Kejriwal on Budget 2021: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ కొన్ని పెద్ద కంపెనీలకే..
Arvind Kejriwal on Budget 2021: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌పై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంటుండగా.. ఇది కార్పోరేట్లకే మేలు చేస్తుందంటూ విపక్షాలు కేంద్రాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ కొన్ని పెద్ద కంపెనీలకే లాభం చేకూరుస్తుందంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ట్విట్ చేశారు.
”ఈ బడ్జెట్ కొన్ని పెద్ద కంపెనీలకు మాత్రమే లబ్ది చేకూరుస్తుంది. ఈ బడ్డెట్ ధరలను పెంచడంతోపాటు.. సామాన్య ప్రజల సమస్యలను మరింత పెంచడానికి పని చేస్తుంది” అంటూ కేజ్రీవాల్ ఎద్దెవా చేస్తూ ట్విట్ చేశారు. అయితే దీనికి గల కారణాలను మాత్రం కేజ్రీవాల్ వివరంగా రాయలేదు. ఇదిలాఉంటే.. ఆప్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ బడ్జెట్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు.
Also Read:
Metro Neo:మెట్రోలైట్ స్థానంలో చౌకైన ‘మెట్రో నియో’.. మొదటిసారిగా ఢిల్లీలో పరుగులు.. ఎలా ఉంటుందంటే..?