AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021: చదువుకు పట్టం కట్టిన నిర్మలమ్మ.. లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ.. నేషనల్‌ అప్రెంటిసిషిప్‌ స్కీం కోసం రూ.3వేల కోట్లు

విద్యారంగానికి ఈసారి బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు చేసినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో 93వేల 224 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు.

Budget 2021: చదువుకు పట్టం కట్టిన నిర్మలమ్మ.. లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ.. నేషనల్‌ అప్రెంటిసిషిప్‌ స్కీం కోసం రూ.3వేల కోట్లు
Balaraju Goud
|

Updated on: Feb 01, 2021 | 4:41 PM

Share

National Education Policy : విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అందుకే ఈసారి బడ్జెట్‌లోనూ అత్యధిక కేటాయింపులు చేసినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగానికి 93వేల 224 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యారంగంపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు పేర్కొన్న నిర్మలా సీతారామన్‌… ఈసారి కూడా ఆ దిశగానే బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్టు పార్లమెంట్‌కు వివరించారు. విద్యతో పాటు మానవ వనరుల అభివ‌ృద్ధి కోసం, విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు ఈ బడ్జెట్‌లో అత్యధిక నిధులు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.

విద్యా రంగం కోసం జీడీపీలో 3.5 శాతం నిధులు కేటాయించినట్టు సీతారామన్ వివరించారు. దేశవ్యాప్తంగా 100 సైనిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. పీపీఈ మోడల్‌లో వీటిని నిర్మిస్తారు. ట్రైబల్‌ ఏరియాలో 750 ఏకలవ్య స్కూల్స్‌ను ఎస్టాబ్లిష్‌ చేయనున్నారు. సాధారణ ఏరియాల్లో 20 కోట్ల నుంచి 38 కోట్లు ఖర్చు చేయనున్నారు. కొండ ప్రాంతాల్లో నిర్మించాల్సి వస్తే ఆ ఖర్చును 48 కోట్లకు పెంచనున్నారు.

ఎస్సీల వెల్ఫేర్‌ కోసం పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల రివ్యాంప్ చేశారు. మరో ఆరేళ్లలో దీని కోసం 35వేల 219 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు. ఈ స్కీం ద్వారా సుమారు 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులు లబ్ది పొందనున్నారని నిర్మల వెల్లడించారు. నిస్థా ప్రోగ్రాం ద్వారా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్‌లో దేశవ్యాప్తంగా 56 లక్షల మంది ఉపాధ్యాలను తీర్చిదిద్దనున్నట్టు వివరించారు. దేశవ్యాపంగా ఇంటర్‌నెట్‌ యాక్సిస్‌ పెంచేందుకు నేషనల్‌ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్ మిషన్‌ ఏర్పాటు చేయనున్నారు.

విద్యావ్యవస్థలో స్టాండర్డ్‌ సెట్‌ చేయడం… అక్రిడేషన్ వ్యవస్థ తీసుకురావడం, విధానాల్లో రిగ్యులరేషన్, నిధుల సేకరణలో పారదర్శకత తీసుకొచ్చేలా హయర్‌ ఎడ్యుకేషన్ కమిషన్‌కు లక్ష్యాలు నిర్దేశించారు. నూతన విద్యా వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా 15,000 బడుల్లో క్వాలిటీ పెంచే దిశగా చర్యలు తీసుకోనున్నారు. లదఖ్‌లో విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర చర్యలు తీసుకోబోతున్నట్టు సంకేతాలు ఇచ్చింది. అందుకే లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టుప్రకటించింది.

దేశ ప్రజలకు విద్యను అందించడంతోపాటు వాళ్లలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కూడా ముఖ్యమని కేంద్రం భావించింది. అందుకే ఈ బడ్జెట్‌లో ఆ దిశగానే చర్యలు తీసుకుంది. అందు కోసం ఏర్పాటు చేసిన నేషనల్‌ అప్రెంటిసిషిప్‌ ప్రమోషన్‌ స్కీం కోసం 3వేల కోట్లు నిధులు ఖర్చు చేయనున్నట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి…Union Budget 2021 Telugu Live: నిర్మలమ్మ పద్దుతో దేశ ప్రజలకు సమన్యాయం.. మౌలిక సదుపాయాలే లక్ష్యంః ప్రధాని మోదీ