దేశంలో మొదటిసారిగా విమానాల కోసం వంతెన.. ఎక్కడ కట్టారో తెలుసా ?
దేశంలో అతిపెద్ద విమానశ్రయం ఏదంటే టక్కున గుర్తుకొచ్చేది ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం. అయితే ఈ ఎయిర్‌పోర్టులో మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇటీవల కొత్తగా ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే లతో సహా నాలుగు రన్‌వేను నిర్మించారు.

దేశంలో అతిపెద్ద విమానశ్రయం ఏదంటే టక్కున గుర్తుకొచ్చేది ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం. అయితే ఈ ఎయిర్‌పోర్టులో మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇటీవల కొత్తగా ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే లతో సహా నాలుగు రన్‌వేను నిర్మించారు. అయితే దీన్ని శుక్రవారం పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇండియాలో విమానయాన రంగం అభివృద్ది పథంలో దూసుకెళ్తోందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే అందుబాటులోకి రావడంతో.. కింది నుంచి రోడ్డు మార్గం.. అలాగే పై నుంచి వంతెన తరహా టాక్సివే ఉండటం విశేషం. దేశంలో ఇలాంటి వంతెన కలిగిఉన్న ఎయిర్‌పోర్ట్‌గా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిలిచింది.
ఎయిర్‌పోర్టులో టర్మినళ్లు, హ్యాంగర్లను రన్‌వేలతో అనుసంధానించే ప్రత్యేక మార్గాలే ఈ టాక్సీవేలు. అయితే ఈ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే పొడవు దాదాపు 2.1 కిలోమీటర్లు. ఇది ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నార్త్, సౌత్ ఎయిర్‌ఫీల్డ్‌లను అనుసంధానిస్తోంది. అలాగే మూడో రన్‌వే నుంచి టర్మినల్-1 కి ఉన్న మధ్య దూరాన్ని దాదాపు 7 కి.మీ వరకు తగ్గిస్తుంది. పలు విమానాలు ఈ వంతెన పైనుంచి రాకపోకలు కూడా సాగింవచ్చు. మరో విషయం ఏంటంటే ఢిల్లీ విమానశ్రయానకి ప్రతిరోజు 1500లకు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రయాణికుల సమయం ఆదా చేసేలా మరిన్ని సౌకర్యాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
