కరోనా వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కేంద్రం అడుగులు

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ విలయాన్ని సృష్టిస్తోంది. కరోనా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య భయాన్ని కలిగిస్తోంది.. మొదట్లో టీకా వేయించుకోవడానికి అంతగా ఇష్టపడనివారంతా ఇప్పుడు వ్యాక్సిన్‌ కోసం క్యూలు కడుతున్నారు.

కరోనా వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కేంద్రం అడుగులు
Corona
Follow us

| Edited By: Phani CH

Updated on: May 17, 2021 | 12:48 PM

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ విలయాన్ని సృష్టిస్తోంది. కరోనా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య భయాన్ని కలిగిస్తోంది.. మొదట్లో టీకా వేయించుకోవడానికి అంతగా ఇష్టపడనివారంతా ఇప్పుడు వ్యాక్సిన్‌ కోసం క్యూలు కడుతున్నారు. పడిగాపులు కాస్తున్నారు. టీకాల కోసం ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగే సరికి కొరత ఏర్పడింది. అవును మరి డిమాండ్‌ వందశాతం ఉండి, సప్లై ఒక్క శాతం ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వ్యాక్సిన్‌ తీసుకుంటే ప్రాణాపాయం ఉండదన్న ఒకే ఒక్క భరోసాతో ప్రజలు ఇప్పుడు టీకా కోసం పరుగులు పెడుతున్నారు. వ్యాక్సిన్‌ సెంటర్ల దగ్గరకు వెళ్లడం, అక్కడ టీకాలు లేవని తెలుసుకుని ఊసూరుమంటూ రావడం నిత్యకృత్యమయ్యింది. ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు.. తెలంగాణలో కూడా కోవాగ్జిన్‌ స్టాక్‌ మొత్తం అయిపోయింది. నిజానికి శని, ఆదివారాలలో టీకాల పంపిణీని నిలిపివేస్తున్నామని, మళ్లీ సోమవారం నుంచి ప్రారంభిస్తామని మూడు రోజుల కిందట వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. స్టాక్‌ లేకపోవడంతో కోవాగ్జిన్‌ రెండో డోస్‌ పంపిణీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కోవాగ్జిన్‌ టీకాల పంపిణీపై త్వరలో స్పష్టత ఇస్తామంటోంది.

చాలా చోట్ల ఇదే పరిస్థితి. కోవాగ్జినే కాదు, కోవిషీల్డ్‌ కూడా దొరకడం లేదు. టీకా కొరతతో ఎంతో మంది వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న టీకా సంక్షోభాన్ని అధిగమించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. విదేశీ వాక్సిన్లను దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగా సామర్థ్యం పెంచుకోవడంపైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అయితే, వ్యాక్సిన్‌ ఫార్ములా అందుబాటులోకి వచ్చినా దేశీయంగా మెడికల్‌ కంపెనీలు వ్యాక్సిన్‌ ఉత్పత్తికి రెడీగా ఉన్నాయా? అన్నదే అనుమానం. అక్కడా ఇక్కడా అని లేదు..దేశంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా వ్యాక్సిన్‌ కష్టాలే ! టీకా కోసం భారీ క్యూలే కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సిన్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమైంది. ముందుగా ఫ్రంట్‌ వారియర్స్‌ ఇచ్చారు. తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి రెండు దశల్లో.. టీకాలు వేయడం మొదలు పెట్టారు. వారికి కూడా సరిపడా టీకాలు లేవు. పరిమితంగానే వ్యాక్సిన్స్‌ ఉండటంతో అందరికీ అందడం లేదు. ఇలా వ్యాక్సిన్‌ కష్టాలు ఇంకా తీరనేలేదు కేంద్రమేమో మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా వేయాలని నిర్ణయించింది. ఇప్పుడా ప్రక్రియ కూడా జరుగుతోంది. సరే.. టీకాలు అందరికి ఇవ్వడం మంచిదే! వయసుతో సంబంధం లేకుండా దేశంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ డిమాండ్‌ సరిపడా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందా? అంత ఉత్పత్తి జరుగుతుందా? జనాభాకు తగినట్టుగా టీకాలు తయారవుతున్నాయా? మన దేశం జనాభా 140 కోట్లు..! ఇప్పటి వరకు జనాభాలో కేవలం 13 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ మొదటి డోసు చేరింది. కేవలం మూడు శాతం మందికి మాత్రమే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ చేరింది. మరి ఇంత పెద్ద దేశంలో భారీ జనాభాకు వ్యాక్సిన్ చేరాలంటే టీకా ఉత్పత్తి పెంచడమే మార్గం..! సెకండ్ వేవ్‌తో దేశంలో సెకండ్‌కు ఒక కేసు నమోదు అవుతుంటే వాక్సినేషన్ డ్రైవ్ మాత్రం తాబేలు నడక నడుస్తోంది. మూడు రోజులు వాక్సినేషన్ చేస్తే. మరో మూడు రోజులు సెలవులు ప్రకటించాల్సి వస్తుంది. దీనికి కారణం డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడమే..! భారత్‌లో తయారవుతున్న రెండు కంపెనీల వాక్సిన్‌లకు… తగు ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడంతోనే… ఈ టీకా తంటాలు ఎదురవుతున్నాయి.

ఇప్పుడు ఈ టీకా ఇబ్బందులును అధిగమించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. వాక్సిన్ కంపెనీలతో చర్చలు జరిపి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు ఒప్పించింది. దీంతో ఒక కంపెనీ టీకా టెక్నాలజీ మిగిలిన అన్ని కంపెనీలు షేర్‌ చేసుకునే వీలవుతుంది. అలా.. అన్ని కంపెనీల నుంచి టీకా ఉత్పత్తి పెరిగి తక్కువ సమయంలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే భారత్‌ బయోటెక్‌కు సంబంధించిన కోవాగ్జిన్‌ తయారీలో మాత్రం కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు రష్యా నుంచి స్పుత్నిక్‌ -వి వ్యాక్సిన్‌లు కూడా వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని టీకాలు అందుబాటులోకి రావచ్చు. అప్పుడు ప్రతి ఒక్కరూ టీకా వేసుకునే అవకాశం దొరుకుతుంది..

మరిన్ని ఇక్కడ చూడండి: PUBG Game: .సరికొత్తగా ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ రాబోతోంది..ఎప్పుడో తెలుసా..?? ( వీడియో )

Viral Video: చెట్టుపైనే ఐసోలేషన్‌ ఏర్పాటు చేసుకున్న యువకుడు.. ( వీడియో )

Chennai Metro Jobs: అనుభ‌వం ఆధారంగా చెన్నై మెట్రోలో మేనేజ‌ర్‌ ఉద్యోగాలు.. నెల‌కు రూ. 1,90,000 వ‌ర‌కు జీతం..

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..