Apologies: అమానుషం.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని.. దళితులను పంచాయతీ పెద్దల కాళ్ళు మొక్కించారు!

Apologies:  ఒక పక్క ఆధునికత.. రాకెట్ వేగం.. ప్రపంచాన్ని అరచేతుల్లో చూసే సౌకర్యాలు.. ఇన్ని వున్నా మరోపక్క మన దేశంలో కులసర్పం మాత్రం ఇంకా విషం చిమ్ముతూనే ఉంది.

Apologies: అమానుషం.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని.. దళితులను పంచాయతీ పెద్దల కాళ్ళు మొక్కించారు!
Tamil Nadu
Follow us
KVD Varma

|

Updated on: May 17, 2021 | 12:04 PM

Apologies:  ఒక పక్క ఆధునికత.. రాకెట్ వేగం.. ప్రపంచాన్ని అరచేతుల్లో చూసే సౌకర్యాలు.. ఇన్ని వున్నా మరోపక్క మన దేశంలో కులసర్పం మాత్రం ఇంకా విషం చిమ్ముతూనే ఉంది. ఎన్ని చట్టాలు ఉన్నా.. ఎంతగా మేధావులు చెబుతున్నా ఇప్పటికీ నిమ్న జాతులపై అగ్రవర్ణాల దాష్టీకం ఆగడం లేదు. తాజగా తమిళనాడులో జరిగిన ఓ సంఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కుల అహంకారానికి ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. తమిళనాడు విల్లుపురంలోని ఒక దళిత వర్గానికి చెందిన ముగ్గురు వృద్ధులు ఒక గ్రామ పంచాయతీ పాదాల వద్ద పడవలసి వచ్చింది. కరోనావైరస్ ప్రోటోకాల్‌లను అధిగమించి గ్రామంలో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించినందుకు క్షమాపణలు కోరాల్సి వచ్చింది.

అసలేం జరిగిందంటే.. మే 12 న, తిరువన్నైనల్లూరు సమీపంలోని ఒట్టనందల్ పంచాయతీలోని దళిత కుటుంబాలు తమ గ్రామ దేవత కోసం చాలా చిన్న ఉత్సవ వేడుకలు నిర్వహించడానికి అనుమతి పొందలేదు. కోవిడ్ -19 లాక్డౌన్ నిబంధనలలో భాగంగా నిషేధించబడిన వేడుక ఇది. అయితే, ఈ కార్యక్రమాల కోసం పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ ఉత్సవ నిర్వహణపై పోలీసులకు ఆ గ్రామ పంచాయతీ పెద్దలు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, కోవిడ్ -19 అవకాశం ఉన్నందున.. వందలాది మందిగా అక్కడ ఉన్న ప్రజలను చెదరగొట్టారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను పోలీసులు తిరువన్నైనల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాదని హామీ ఇచ్చిన తరువాత నిర్వాహకులను పోలీసులు ఆ తరువాత విడిచి పెట్టారు.

ఈ బృందం తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయింది. ఈ సమయంలో మే 14 న పంచాయతీ కోర్టుకు హాజరు కావాలని వారికి పంచాయతీ పెద్దలు నోటీసు జారీ చేశారు. దళిత పెద్దలు కోర్టుకు హాజరైనప్పుడు, పండుగను అనుమతి లేకుండా నిర్వహించినందుకు వారిని చీవాట్లు పెట్టారు. తరువాత వారిని గ్రామ పంచాయతీ పాదాల మీద పడమని ఆదేశించారు. దీంతో తిరుమల్, సంతానం, అరుముగం అనే దళిత పురుషులు ఈ తీర్పును పాటించి పంచాయతీ సభ్యుల కాళ్లపై పడి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు ఈ సంఘటన మన దేశంలో ఆగని కుల దురాగతాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Also Read: Vaccine: ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తుల వ్యవస్థలో టాప్ ప్లేస్ లో ఇండియా.. మరి కరోనా టీకాకు ఏమైంది?.. నిపుణులు ఏమంటున్నారు?

Shahid Jameel: కోవిడ్ పాండమిక్ అదుపులో ప్రభుత్వం విఫలం, కరోనా కట్టడి ఫోరానికి సీనియర్ వైరాలజిస్ట్ గుడ్ బై