mamata banerjee at cbi office: సీబీఐ కార్యాలయానికి వచ్చిన బెంగాల్ సీఎం మమత, ఇద్దరు మంత్రులు అరెస్టయ్యే అవకాశం , చక్రం తప్పిన గవర్నర్

బెంగాల్ రాష్ట్రాన్ని నారదా ముడుపుల కేసు వదలడంలేదు., సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గంలోని ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ అనే మంత్రులను సోమవారం ఉదయం కోల్ కతా లో సీబీఐ అధికారులు వారి ఇళ్లకు వెళ్లి అరెస్టు చేసి తమ కార్యాలయానికి తీసుకుపోయారు.

mamata banerjee at cbi office: సీబీఐ కార్యాలయానికి వచ్చిన బెంగాల్ సీఎం మమత, ఇద్దరు  మంత్రులు అరెస్టయ్యే అవకాశం , చక్రం తప్పిన గవర్నర్
Mamata Banerjee
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 17, 2021 | 12:38 PM

బెంగాల్ రాష్ట్రాన్ని నారదా ముడుపుల కేసు వదలడంలేదు., సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గంలోని ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ అనే మంత్రులను సోమవారం ఉదయం కోల్ కతా లో సీబీఐ అధికారులు వారి ఇళ్లకు వెళ్లి అరెస్టు చేసి తమ కార్యాలయానికి తీసుకుపోయారు. ఏ మాత్రం ఊహించని ఈ ఘటనతో షాక్ తిన్న మమత హడావుడిగా ఈ ఆఫీసుకు వెళ్లారు. తమకు ఎలాంటి వారంట్ జారీ చేయకుండానే అరెస్టు చేశారని ఫిర్హాద్ హకీమ్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఇదే పార్టీకి చెందిన మాజీ నేత సోవన్ ఛటర్జీని కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సోవన్ మాజీ మేయర్, మాజీ మంత్రి కూడా.. ఈయన 2019 లో తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఆ తరువాత మార్చి నెలలో ఆ పార్టీని కూడా వీడారు.ఈ నలుగురిపై సీబీఐ విచారణకు గవర్నర్ జగ దీప్ ధన్ కర్ అనుమతించారు.. ప్రత్యేక కోర్టు ముందు వీరిని హాజరు పరిచి ఛార్జ్ షీట్ రూపొందిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. వీరిని తమ కస్టడీకి కోరుతామని వారు చెప్పారు. సాధారణంగా ఎమ్మెల్యేలను అరెస్టు చేసేందుకు సీబీఐ స్పీకర్ అనుమతిని కోరాల్సి ఉంటుంది. కానీ ఈ సందర్భంలో గవర్నర్ అనుమతిని వీరు కోరడం విశేషం. 2014 లో నారదా బ్రైబరీ కేసు రాష్ట్రాన్ని వణికించింది. అప్పుడు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ చేత మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నారదా న్యూస్ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ నలుగురు ముడుపులు తీసుకుంటూ దొరికిపోయారు. ఇంకా ఏడుగురు ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఓ పోలీసు అధికారి కూడా బాగోతం కూడా వెల్లడైంది.

మరిన్ని ఇక్కడ చూడండి: PUBG Game: .సరికొత్తగా ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ రాబోతోంది..ఎప్పుడో తెలుసా..?? ( వీడియో )

Viral Video: చెట్టుపైనే ఐసోలేషన్‌ ఏర్పాటు చేసుకున్న యువకుడు… ( వీడియో )

Varun Tej: మరో సూపర్ హిట్ డైరెక్టర్ తో చేతులు కలిపిన మెగా హీరో వరుణ్ తేజ్.. ఈసారి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!