నన్ను కూడా అరెస్టు చేయండి, సీబీఐ అధికారులకు మమతా బెనర్జీ సవాల్, కోల్ కతా లో దర్యాప్తు సంస్థ కార్యాలయం వద్ద టీఎంసీ కార్యకర్తల నిరసన
శారదా ముడుపులకేసులో తన మంత్రివర్గ సహచరులిద్దరిని సీబీఐ అరెస్టు చేయడంతో ఆగ్రహించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను కూడా అరెస్టు చేయాలని సవాల్ విసిరారు.
శారదా ముడుపులకేసులో తన మంత్రివర్గ సహచరులిద్దరిని సీబీఐ అరెస్టు చేయడంతో ఆగ్రహించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను కూడా అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. వారి అరెస్టు చట్టవిరుద్ధమని, తనను అదుపులోకి తీసుకునేంతవరకు ఈ కార్యాలయాన్ని వీడబోనని ఆమె మంకుపట్టు పట్టారు. ఈ పరిణామాలతో నగరంలోని సీబీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని తమ మంత్రులను ఎమ్మెల్యేలను విడుదల చేయాలంటూ ఆందోళనకు పూనుకొన్నారు. ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, అనే మంత్రులతో బాటు మదన్ మిత్రా అనే ఎమ్మెల్యేని కూడా సీబీఐ అరెస్టు చేసింది. కాగా వీరిని అరెస్టు చేసే ముందు తన అనుమతి తీసుకోలేదని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇలా ఎమ్మెల్యేలను అరెస్టు చేయడానికి ముందు సభాపతి అనుమతి అవసరమని, కానీ ఈ కేసులో అలా చేయలేదని ఆయన అన్నారు. అటు వరుస అరెస్టులతో కేంద్ర బలగాలను కూడా సీబీఐ కార్యాలయం వద్ద మోహరించారు. గవర్నర్ జగ దీప్ ధన్ కర్ అనుమతితో తాము వీరిని అదుపులోకి తీసుకున్నామని సీబీఐ అధికారులు చెప్పడం విశేషం. 2014 నాటి శారదా బ్రైబరీ కేసు మళ్ళీ ఇప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వానికి తలనొప్పిని తెచ్చిపెట్టింది. గవర్నర్ ఆ అవకాశాన్ని తనకు అనువుగా వినియోగించుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: PUBG Game: .సరికొత్తగా ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ రాబోతోంది..ఎప్పుడో తెలుసా..?? ( వీడియో )
Viral Video: చెట్టుపైనే ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న యువకుడు… ( వీడియో )