Bike Ambulance: ఇది షోలే బైక్ కాదు..అధునాతన అంబులెన్స్..ఆలోచన అదిరింది కదూ..ఈ సరికొత్త బైక్ అంబులెన్స్ ఎక్కడంటే..

Bike Ambulance: కష్టాల్లో ఉన్నపుడే ఆలోచన సరిగా పనిచేయాలి. ఒక్కోసారి మనకు ఆలోచన తట్టకపోతే.. అప్పుడు సినిమాలు గుర్తుచేసుకోవాలి. ఇదేదో సరదాకి చెప్పడం లేదు.

Bike Ambulance: ఇది షోలే బైక్ కాదు..అధునాతన అంబులెన్స్..ఆలోచన అదిరింది కదూ..ఈ సరికొత్త బైక్ అంబులెన్స్ ఎక్కడంటే..
Bike Ambulance
Follow us
KVD Varma

|

Updated on: May 17, 2021 | 2:05 PM

Bike Ambulance: కష్టాల్లో ఉన్నపుడే ఆలోచన సరిగా పనిచేయాలి. ఒక్కోసారి మనకు ఆలోచన తట్టకపోతే.. అప్పుడు సినిమాలు గుర్తుచేసుకోవాలి. ఇదేదో సరదాకి చెప్పడం లేదు. తమ ప్రాంతంలో ప్రజలు ఆసుపత్రులకు చేరే మార్గం లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసిన ఒకాయనకు ఏదైనా చేయాలని అనిపించింది. మినీ అంబులెన్స్ తయారు చేస్తే బావుండును అనిపించింది. దానికోసం తన తోటివారితో ఎన్నోరోజులు ఆలోచించారు. అనుకోకుండా.. వారి బృందంలోని ఓ వ్యక్తి షోలే సినిమాను గుర్తు చేశారు. ఎందుకో తెలుసా? అందులో ఓ బైక్ ఉంటుంది.. అమితాబ్, ధర్మేంద్ర ఆ బైక్ మీద పాటలు పాడుకుంటూ తిరుగుతారు. ఆ బైక్ తర్వాత చాలాకాలం ట్రెండీగా నిలిచింది. సరిగ్గా అదే ఆలోచన అంబులెన్స్ కు వాడుకోవచ్చు అనుకున్నారు. దానిని సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ బైక్ అంబులెన్స్ ఒకటి కాదు రెండు వినియోగంలోకి వచ్చాయి. ఆ షోలే బైక్ అంబులెన్స్ కథ మీకోసం..

కరోనా మహమ్మారితో దేశం ఇబ్బందులు పడుతోంది. ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్‌తో పాటు అంబులెన్స్‌ల కొరత భారీగా ఉంది. మీకు అంబులెన్స్ వచ్చినా, ట్రాఫిక్ జామ్ కారణంగా ఆసుపత్రికి చేరేముందు చాలా సార్లు రోగి మరణిస్తాడు. ఇలాంటి అనేక సంఘటనలు తెరపైకి వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ సమస్యను అధిగమించడానికి మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో బైక్ అంబులెన్స్ సేవ ప్రారంభించారు. ఇందులో అంబులెన్స్ స్ట్రెచర్, ఆక్సిజన్ కిట్, లైట్, ఫ్యాన్, ఐసోలేషన్ క్యాబిన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ అంబులెన్స్‌కు ఫస్ట్ రెస్పాండర్ అని పేరు పెట్టారు. పాల్గర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి అలర్ట్ సిటిజెన్స్ ఫోరం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం రెండు బైక్ అంబులెన్స్‌లను ఇచ్చాయి. ఇవి ఇప్పుడు రోగులకు సేవ చేయడానికి అక్కడి రోడ్లపై నడుస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో 23 బైక్ అంబులెన్స్‌లను జిల్లా యంత్రాంగానికి అందించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బైక్ అంబులెన్స్..ఇలా ఉంటుంది!

ఈ బైక్ అంబులెన్స్ తయారీకి సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇది అంబులెన్స్‌లో అందుబాటులో ఉండే ప్రతి సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ఈ అంబులెన్స్‌ను బైక్ కంటైనర్ లాగా అభివృద్ధి చేశారు. ఇది బైక్ అనుసంధానంగా చిన్న కారులా ఉంటుంది. ఇందులో లైట్, ఫ్యాన్, రెస్క్యూ స్ట్రెచర్, సెలైన్ స్టాండ్, ఆక్సిజన్ సిలిండర్ స్పేస్, అలాగే రోగి బంధువు కోసం సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లో, సరైన వెంటిలేషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆల్ రౌండ్ విండోస్ కూడా దీనికి ఇచ్చారు. బైక్ యొక్క ప్రధాన బ్యాటరీ విఫలమైతే, దాని కోసం అదనపు బ్యాటరీ కూడా ఉంది. ఈ ఆలోచన ఎవరిది?

36 ఏళ్ల నిరంజన్ అహెర్ ఈ బైక్ అంబులెన్స్‌ను అభివృద్ధి చేశారు. ఆయన అక్కడ సిటిజెన్ ఫోరం వ్యవస్థాపకుడు. ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి అంశాలపై గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సంస్థ పాల్ఘర్ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తోంది. ఆరోగ్యం యొక్క వివిధ అంశాలపై పనిచేస్తున్నప్పుడు, గోతులతో నిండిన చిన్న మార్గాల కారణంగా, రోగులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం అవడాన్ని ఆయన గమనించారు. సరైన సమయంలో చికిత్స లేకపోవడం వల్ల చలా మంది చనిపోతున్నారని గ్రహించారు. ఈ సమస్య నుండి ప్రజలను బయటకు తీసుకురావడానికి ఆయన చాలా ప్రయోగాలు, పరిశోధనలు చేశారు. ఆ సమయంలో ఒక నిపుణుడిని కలిసిన తరువాత, ఆయన ఇచ్చిన చిన్న ఆలోచనతో వారు మోటారు బైక్ అంబులెన్స్‌ను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు. ”మాకు ఈ పని సవాలు కంటే తక్కువ కాదు, ఎందుకంటే దీనిని తయారుచేసే ముందు, రోగుల యొక్క ప్రతి సదుపాయాన్ని మేము చూసుకోవాలి. ఒకసారి మేము దాని మోడల్ గురించి ప్లాన్ చేస్తున్నాము. అదే సమయంలో మా బృందం సభ్యులు షోలే మూవీలో ఉపయోగించిన బైక్‌ను గుర్తు చేసుకున్నారు. దీనికి సైడ్ కారు ఉంటుంది. ఈ ఆలోచన నచ్చింది. మేము దానిపై పనిచేయడం ప్రారంభించాము. నాలుగైదు నెలల హార్డ్ వర్క్ తరువాత, ఫస్ట్ రెస్పాండర్ అనే ఈ బైక్ తయారీ విజయవంతమైంది. ఈ బైక్ అంబులెన్స్ తయారీకి సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది.” అంటూ చెప్పారు నిరంజన్ అహెర్.

ప్రస్తుతం కరోనా రోగులను ఆసుపత్రికి తరలించడానికి ఈ బైక్ అంబులెన్స్ ఉపయోగిస్తున్నారు. దాని కంటైనర్ బాగా వేరుచేసి బైక్ కు సంబంధం లేనట్టుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పారామెడిక్ డ్రైవర్ పిపిఇ కిట్ ధరించాల్సిన అవసరం లేదు. రోగి ఆసుపత్రి కి బయలుదేరే ముందు బైక్ అంబులెన్స్ శుభ్రపరుస్తారు. ఇందుకోసం అందులో శానిటైజర్ సదుపాయం కూడా ఉంది. గ్రామాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లే విధానం ప్రస్తుతం సరిగా లేదని నిరంజన్ అహెర్ చెప్పారు. నగరం నుండి అంబులెన్స్‌లను పిలవడానికి రోడ్లు కూడా సరైనవి కావు. అటువంటి పరిస్థితిలో, వారు ఈ మోడల్ నుండి సౌలభ్యం పొందుతారని ఆయన అంటున్నారు.

Also Read: Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ పంజా… మందుల కొరతతో రోగులకు ప్రాణ సంకటం

Bank Services: బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. ఆ రోజు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు.. ఆర్బీఐ కీలక ప్రకటన