నాకు దేశమే ముఖ్యం.. అర్షద్ నదీమ్‌ను ఆహ్వానించడంపై మౌనం వీడిన నీరజ్ చోప్రా..
Arshad Nadeem vs Neeraj Chopra: NC క్లాసిక్ 2025 ఈవెంట్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జావెలిన్ త్రో చాంపియన్ అర్షద్ నదీమ్‌కు నీరజ్ చోప్రా ఆహ్వానం అందించిన సంగతి తెలిసిందే. ఈ అథ్లెటిక్స్ మెగా ఈవెంట్ మే 24న కర్నాటకలోని బెంగళూరులో జరగనుంది. అయితే, నీరజ్ చోప్రా ఆహ్వానాన్ని సున్నితంగా అర్షద్ నదీమ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా, పహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్‌కు ఆహ్వానం అందడంతో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా తన మౌనాన్ని వీడాడు.

Arshad Nadeem vs Neeraj Chopra: NC క్లాసిక్ 2025 ఈవెంట్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జావెలిన్ త్రో చాంపియన్ అర్షద్ నదీమ్‌కు నీరజ్ చోప్రా ఆహ్వానం అందించిన సంగతి తెలిసిందే. ఈ అథ్లెటిక్స్ మెగా ఈవెంట్ మే 24న కర్నాటకలోని బెంగళూరులో జరగనుంది. అయితే, నీరజ్ చోప్రా ఆహ్వానాన్ని సున్నితంగా అర్షద్ నదీమ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా, పహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్‌కు ఆహ్వానం అందడంతో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా తన మౌనాన్ని వీడాడు. తన దేశభక్తి గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఏప్రిల్ 25న ఆయన ఓ ప్రకటన విడుదల చేశాడు. అర్షద్ నదీమ్‌కు ఫోన్ చేసినందుకు తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని, దీనిని ఎప్పటికీ సహించని చెప్పుకొచ్చాడు. పహల్గామ్ దాడికి ముందే అర్షద్‌కు ఆహ్వానం పంపినట్లు నీరజ్ స్పష్టం చేశాడు. నాకు దేశం, దేశ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత అంటూ తేల్చి చెప్పాడు.
‘నా సమగ్రతను ప్రశ్నించడం బాధాకరం’..
నీరజ్ చోప్రా ఇంకా మాట్లాడుతూ, “నేను చాలా సంవత్సరాలుగా నా దేశానికి సగర్వంగా సేవ చేస్తున్నాను. ఈ రోజు నా సమగ్రతను ప్రశ్నిస్తున్నారు. ఇది చూడటానికి చాలా బాధగా ఉంది. నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే వారికి నేను వివరించాల్సి రావడం నాకు బాధగా ఉంది. మీడియాలోని కొన్ని వర్గాలు నా చుట్టూ చాలా తప్పుడు కథనాలను కల్పించాయి. కానీ నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే, అది నిజమని చాలామంది అనుకుంటారు” అంటూ చెప్పుకొచ్చాడు.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 25, 2025
నీరజ్ తల్లిపైనా విమర్శలు..
అర్షద్ నదీమ్ గురించి చేసిన ప్రకటనపై నీరజ్ చోప్రా తల్లిని కూడా లక్ష్యంగా చేసుకోవడం పట్ల కూడా విచారం వ్యక్తం చేశాడు. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా అర్షద్‌ను తన కొడుకులాంటివాడని నీరజ్ తల్లి అభివర్ణించింది. దీనిపైనే చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆ సందర్భం వేరే అని చాలామందికి తెలియడం లేదంటూ గుర్తు చేశాడు. “ప్రజలు తమ అభిప్రాయాన్ని ఎలా మార్చుకుంటారో నాకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. నా తల్లి ఒక సంవత్సరం క్రితం ఈ ప్రకటన ఇచ్చింది. అప్పుడు ఆమె అభిప్రాయాలను చాలా ప్రశంసించారు. నేడు, అదే వ్యక్తులు అదే ప్రకటనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు” అని నీరజ్ తెలిపాడు.
ఆహ్వానాన్ని తిరస్కరించిన అర్షద్ నదీమ్..
నీరజ్ చోప్రా నాయకత్వంలో మే 24 నుంచి భారతదేశంలో NC క్లాసిక్ జావెలిన్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. నీరజ్ చోప్రాతో సహా ప్రపంచంలోని చాలా మంది స్టార్ ఆటగాళ్ళు ఇందులో పాల్గొనబోతున్నారు. ఈ పోటీకి పాకిస్తాన్ జావెలిన్ స్టార్ అర్షద్ నదీమ్‌ను కూడా పిలిచారు. కానీ, అతను నీరజ్ ప్రతిపాదనను తిరస్కరించాడు. భారతదేశానికి రావడానికి నిరాకరించాడు. అర్షద్ ప్రకారం, ఈ సమయంలో అతను ఇతర టోర్నమెంట్లలో బిజీగా ఉంటాడు. అందువల్ల NC క్లాసిక్ జావెలిన్ టోర్నమెంట్‌లో పాల్గొనలేనంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




